బిట్ కాయిన్ స్కాంలో మోసపోయిన బాధితులు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను కలిశారు. బెల్లంపల్లి, గోదావరిఖని ప్రాంతాలకు చెందిన సుమారు 250 మంది రూ. 50 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేసినట్లు బాధితులు తెలిపారు. అదే ప్రాంతానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి ... బిట్ కాయిన్ లో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మబలికడని పేర్కొన్నారు.
ఒక్కొక్కరి వద్ద నుంచి లక్షల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయించుకొని పరారయ్యాడని తెలిపారు. 2018లో నాగరాజుతో పాటు దిల్లీకి చెందిన బిట్ కాయిన్ నిర్వహకులపై బాధితులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల నాగరాజును సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకోగా... తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకున్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో రెండు లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు