హైదరాబాద్‌లో జరుగుతున్న బయో ఏషియా సదస్సులో భాగంగా రెండో రోజు కార్యక్రమంలో సీఈఓ ఎన్‌క్లేవ్‌లో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో కలిసి కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్ పాల్గొన్నారు. వారిద్దరి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. " ఇండియాను కేటీఆర్ మార్కెటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. మార్కెటింగ్‌లో ఆయనకు మంచి నైపుణ్యం ఉంది. దీనికోసం హైదరాబాద్ దాటి ఆయన వెళ్లాల్సి ఉంది. ప్యానల్ చర్చలో హైదరాబాద్ ఎక్కువ సార్లు వినిపించింది" అని ప్యానల్ చర్చలో భాగంగా పీయూష్ గోయల్ అన్నారు.
కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తూ.... మేము జాతీయ పార్టీ పెట్టాలని మీరు అనుకుంటున్నారా? అన్నారు. దీనికి "మీరు జాతీయ పార్టీ పెట్టినట్లయితే మేము స్వాగతిస్తాం. ఎందుకంటే అక్కడ శూన్యత ఉంది. భాజపా తప్ప మిగిలినవేవీ జాతీయ పార్టీగా కనిపించట్లేదు." అని పీయూష్ గోయల్ నవ్వుతూ బదులిచ్చారు. ఆయన మాటలపై కేటీఆర్ కూడా నవ్వారు.