ETV Bharat / state

Hyderabad Rains: ఫస్ట్ షో చూసి బయటికొచ్చే సరికే... ఏం జరిగిందో తెలుసా? - హైదరాబాద్​ జిల్లా వార్తలు

భాగ్యనగరంలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి(Hyderabad Rains) లోతట్టు ప్రాంతాల్లోని పలు కాలనీలు నీట మునిగాయి. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో కురిసిన భారీ వర్షం(Hyderabad Rains)తో రహదారులు వాగులను తలపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులుతో కూడిన వర్షానికి తీవ్రనష్టం వాటిల్లింది. దిల్​సుఖ్ నగర్ శివ గంగ థియేటర్(Dilsukhnagar Shiva Ganga Theatre) ప్రహరీ గోడ కూలి ప్రేక్షకుల బైకులు నుజ్జు నుజ్జు అయ్యాయి. దీంతో ప్రేక్షకులు యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

bikes-destroy-due-to-heavy-rain-at-dilsukhnagar-siva-ganga-theater-in-hyderabad

author img

By

Published : Oct 9, 2021, 3:15 PM IST

Updated : Oct 9, 2021, 5:29 PM IST

మూడు గంటలపాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి(Hyderabad Rains) నగరం తడిసి ముద్దైంది. రహదారులు వాగులను తలపించాయి. ఉరుములు, మెరుపులతో వాన(Hyderabad Rains) పడి కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులుతో కూడిన వర్షానికి(Hyderabad Rains) తీవ్రనష్టం వాటిల్లింది. దిల్​సుఖ్ నగర్ శివ గంగ థియేటర్(Dilsukhnagar Shiva Ganga Theatre) ప్రహరీ గోడ కూలడంతో ప్రేక్షకుల 50 ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఫస్ట్‌ షో సినిమా చూసి థియేటర్ బయటకు వచ్చిన ప్రేక్షకులు తన బైక్​లు దెబ్బతినడంతో యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Hyderabad Rains: ఫస్ట్ షో చూసి బయటికొచ్చే సరికే... ఏం జరిగిందో తెలుసా?

గల్లంతైన వ్యక్తి సురక్షితం

ఎల్బీ నగర్​లో భారీ వర్షం కారణంగా చింతల కుంట వద్ద ఓ ద్విచక్ర వాహానదారుడు వరద ప్రవాహంలో బైక్ తో సహా కొట్టకుపోయాడు. గమనించిన స్థానికులు అతన్ని కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలానికి చేరుకుని ద్విచక్ర వాహనాన్ని బయటకు తీశారు. డీఆర్‌ఎఫ్ బృందాలు గల్లంతైన వ్యక్తి కోసం గాలింప చేపట్టారు. ఘటనా స్థాలాన్ని మేయర్ గద్వాల విజయ లక్ష్మి, స్థానిక ఎమ్‌ఎల్యే సుధీర్ రెడ్డి పరిశీలించారు. ఇంతలో గల్లంతైన వ్యక్తి సురక్షితంగా తిరిగి వచ్చాడని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గల్లంతైన వ్యక్తి సరూర్ నగర్ కు చెదిన అటో డ్రైవర్ జగదీష్ గా గుర్తించారు. మరో వైపు చంపాపేట లోని నాలలో బైక్ తో సహా వ్యక్తి కొట్టుకుపోయారని సమాచారంతో అక్కడికి చేరుకున్న అధికారులు అవాస్తవమని గుర్తించారు.

అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు...

ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలను సూచించారు. సహాయం కోసం కంట్రోల్‌ రూంను సంప్రదించాలని కోరారు. అత్యవసర సమయంలో నగర వాసులు 040 2111 1111 నంబర్​కు ఫోన్​ చేసి సహాయం పొందాలని పేర్కొంది.

ఇదీ చదవండి: Snake Viral Video: వాకింగ్ ట్రాక్​లోకి కొండచిలువ.. వాళ్లేం చేశారో తెలుసా?

Last Updated : Oct 9, 2021, 5:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.