ETV Bharat / state

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా భోగి వేడుకలు - Bhogi celebrations across the state

Bhogi celebrations in Telangana: రాష్ట్ర వ్యాప్తంగా భోగి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భోగిమంటలు వేసి కోలాటాలు ఆడుతూ భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.

Bhogi celebrations in Telangana
Bhogi celebrations in Telangana
author img

By

Published : Jan 14, 2023, 6:42 AM IST

Updated : Jan 14, 2023, 11:36 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా భోగి వేడుకలు

Bhogi celebrations in Telangana: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భోగి పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే భోగి మంటలతో ఇళ్ల ముందు విభిన్న రంగులతో రంగవల్లులు వేస్తూ చిన్నా పెద్దా సందడి చేశారు. ఆవు పేడతో చేసిన పిడకలు, తాటాకులు, చెట్ల కర్రలతో వేసే భోగి మంటలతో.. బద్ధకంతో పాటు మదిలోని నిరాశానిస్పృహలనూ వదిలిస్తాయని ప్రజలు విశ్వసిస్తారు. హైదరాబాద్​లోని కేబీఆర్‌ పార్కు వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన భోగి వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, గంగిరెద్దుల ఆటలతో సందడి వాతావరణం నెలకొంది. తెలంగాణ జాగృతి నుంచి భారత్ జాగృతిగా రూపాంతరం చెందాక.. మొదటి సంక్రాంతి వేడుకలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పాత ఆలోచనలు భోగి మంటల్లో వేసి.. కొత్త ఆలోచనలకు నాంది పలకడం ఈ పండుగ ఉద్దేశమని చెప్పారు. హైదరాబాద్​లో కూడా సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని అన్నారు. మనలోని ప్రతికూలతలను విడిచిపెట్టి.. నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్దామని వివరించారు.

"తెలంగాణ జాగృతి భారత్ జాగృతిగా రూపొందిన తర్వాత సంక్రాంతి పండుగ చేసుకోవడం సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారిని అభినందిస్తున్నాను. భోగి పండుగ రోజు ప్రతికూల ఆలోచనలను తొలగించుకొని దేశం కోసం, సమాజం కోసం పాటుపడే విధంగా నడుం బిగించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను." - కవిత, ఎమ్మెల్సీ

సంక్రాంతి వేడుకలు మన సంప్రదాయంలో అత్యుత్తమం: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్​ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ సమృద్ధిగా సంతోషం, శ్రేయస్సు, ఆరోగ్యం తీసుకురావాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు. సంక్రాంతి వేడుకలు మన సంప్రదాయంలో అత్యుత్తమమైనవన్న గవర్నర్.. అన్ని వర్గాలను కలిపే ఈ శుభ సందర్భం అని అన్నారు. ప్రేమ, ఆప్యాయత, సౌభ్రాతృత్వం, మంచి ఆలోచనలను ప్రేరేపిస్తుందని చెప్పారు.

రాష్ట్ర ప్రజలంతా భోగభాగ్యాలతో విలసిల్లాలి: మంత్రి ఎరబెల్లి దయాకర్ రావు ఇంట భోగి వేడుకలను నిర్వహించారు. వరంగల్ జిల్లా పర్వతగిరిలోని నివాసం వద్ద సంబరాల్లో.. మంత్రి పాల్గొని కోలాటం ఆడి సందడి చేశారు. రాష్ట్ర ప్రజలంతా భోగభాగ్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ ఉప్పల్‌లోని మినీ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. గంగిరెద్దుల ఆటలు.. హరిదాసుల హరి సంకీర్తనలు.. బుడబుక్కల జంగమదేవరల గారడీ మాటలు , పిట్టలదొర పిట్ట కథలు, ఎరుకలసాని చెప్పే సోది ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ఇవీ చదవండి: రాష్ట్ర నలుమూలలా సంక్రాంతి శోభ.. అందంగా ముస్తాబైన ఊరూవాడ

'మోదీ దేవుడు.. ఆయనకు వీరాభిమానిని.. అందుకే దండ వేయాలనుకున్నా'

Last Updated : Jan 14, 2023, 11:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.