ETV Bharat / state

'భీష్ముని ఆశయాలు గంగపుత్రులు కొనసాగించాలి' - హైదరాబాద్​ వార్తలు

భీష్మ పితామహుని ఆశయాలను గంగపుత్రులు కొనసాగించాలని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ అన్నారు. హైదరాబాద్​లోని బషీర్​బాగ్​ ప్రెస్​ క్లబ్​లో గంగపుత్రుల చైతన్య సమితి ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

Bheeshma celebrations basheerbagh press club in hyderabad
'భీష్ముని ఆశయాలు గంగపుత్రులు కొనసాగించాలి'
author img

By

Published : Feb 16, 2021, 4:30 PM IST

గంగపుత్రుల ఆధ్వర్యంలో మొదటిసారి భీష్ముని మహోత్సవాలను జరుపుకోవడం అభినందనీయమని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ ప్రశంసించారు. ధర్మాన్ని రక్షించడం కోసం విష్ణు సహస్రనామాలు పఠనం చేయాలని సూచించారు. హైదరాబాద్​లోని బషీర్​బాగ్​ ప్రెస్​క్లబ్​లో గంగపుత్రుల చైతన్య సమితి ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

మహాభారతంలో వేదవ్యాసుడు రాసిన భీష్ముని పాత్ర మహోన్నతమైనదని.. ఆయన ఆశయాలను ఆచరణలో కొనసాగించాలని కోరారు. ఏకాదశి రోజున సహస్ర నామాన్ని దేవాలయాల్లో పఠిస్తున్నామని రంగరాజన్​ తెలిపారు. ప్రతి ఏటా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని గంగపుత్ర చైతన్య సమితి అధ్యక్షుడు పూస సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గంగపుత్రులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.

ఇదీ చూడండి : కీసరగుట్టలో వేద పాఠశాలను పరిశీలించిన తితిదే ఈవో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.