రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన విపరీత పరిస్థితులకు దారితీస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆక్షేపించారు. పార్ట్-బీలో పెట్టిన భూముల సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒక ప్రభుత్వ అధికారిని తన కార్యాలయంలోనే కాల్చి చంపిన ఘటన దేశంలో ఎక్కడా జరగలేదన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే దీనికి కారణమని ఆరోపించారు. తహసీల్దార్ విజయారెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: అబ్దుల్లాపూర్మెట్లో భూ మాఫియా... రెండు వర్గాలదే హవా