తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ప్రముఖ రచయిత, విరసం నాయకులు, పౌర హక్కుల నేత వరవరరావుకు మెరుగైన వైద్యం అందించాలని... లేకపోతే ఆయన ప్రాణానికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. వరవరరావు ఆరోగ్యాన్ని కాపాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భట్టి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్య మంత్రి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
న్యాయస్థానాలు శిక్షించిన వారికి ఆరోగ్యం బాగలేకపోతే మెరుగైన వైద్యం అందిస్తారు. ఉరి శిక్ష విధించిన ఖైదులకూ ఆరోగ్యం బాగలేకపోతే ఉరి వాయిదా వేస్తారు. అలాంటిది... రోజుల తరబడి అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యమ నేతను ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని అన్నారు.
పౌర హక్కుల సాధన కోసం ఉద్యమిస్తున్న వరవరరావుకు జైల్లో ఏదైనా జరిగితే అది రాజ్యం చేసిన ద్రోహం అవుతుందని పేర్కొన్నారు. బీమాకోరేగావ్ కేసులో భాగంగా 2018 ఆగస్టులో అయన్ని అరెస్టు చేశారు.
ఇదీ చూడండి: రాజ్భవన్లో కరోనా కలకలం.. 48 మందికి పాజిటివ్, గవర్నర్కు పరీక్ష