కాగజ్‌నగర్ అటవీశాఖాధికారిణిపై జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ అనితపై దాడి చేయడం అమానుషమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సార్సాల ఘటనపై కమిటీ వేసినట్లు భట్టి వెల్లడించారు. శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, పొదెం వీరయ్య, సీతక్కలతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీ వాస్తవ పరిస్థితి, అటవీ చట్టం అమలు, పోడు భూముల సమస్యలపై అధ్యయనం చేసి వారం రోజుల్లో రాష్ట్ర కమిటీకి నివేదిక ఇస్తుందని భట్టి విక్రమార్క వివరించారు.
ఇవీ చూడండి: రాష్ట్ర అర్హత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి