భాజాపాలో అంతర్గత విభేదాలు లేవని పార్టీ కుటుంబం లాంటిదని చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ పరిష్కరించకుంటామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ నుండి జనాభా సేకరణను కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నట్లు తెలిపారు. అస్సాం రాష్ట్రం మినహాయించి మిగతా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు. చిలకలగూడలో భాజాపా సికింద్రాబాద్ నియోజకవర్గ సభ్యత్వ నమోదు సమీకరణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇటీవల పార్టీలో చేరిన వారికి పార్టీ విధి విధానాలు, సిద్ధాంతాల పట్ల త్వరలోనే దేశవ్యాప్తంగా 303 స్థానాలలో ప్రత్యేక శిక్షణ బృందాలను ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి : 'సీఆర్ఏ-రూట్ జోన్'తో మొక్కలకు బూస్ట్