అమ్ముడుపోయే పంటలే వేయాలి
రాష్ట్రంలో పంటల సాగు వ్యూహంపై సీఎం కేసీఆర్ 3 రోజులపాటు విస్తృతంగా చర్చించారు. మార్కెట్‌లో అమ్ముడుపోయే పంటలే సాగుచేసే అలవాటు రైతుల్లో రావాలన్నారు. ఇంకేమన్నారంటే?
మెట్రో టికెట్ ధరలపై హైకోర్టులో పిటిషన్
మెట్రోరైలు టికెట్ ధరలపై హైకోర్టులో సీపీఎం పిటిషన్ దాఖలు చేసింది. రాయితీ ఒప్పందానికి విరుద్ధంగా మెట్రో టికెట్ల ధరలు ఖరారు చేశారని హైదరాబాద్ సీపీఎం నగర కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి వ్యాజ్యం దాఖలు చేశారు. హైకోర్టు ఏం ఆదేశించిందంటే?
రెండ్రోజులు వర్షాలు
'నిసర్గ' ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్న తెలిపారు. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే వీలుందని వెల్లడించారు. మరిన్ని విశేషాలకై క్లిక్ చేయండి!
దిశను మార్చుకున్న మిడతల దండు!
దక్షిణాది రాష్ట్రాలకు మిడతల ముప్పు తప్పినట్టేనని ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గాలి వాటంతో ప్రయాణించే మిడతలు రుతుపవనాల ప్రభావం వల్ల దిశను మార్చుకున్నాయని స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు దండు ఎక్కడుందంటే?
'ఒకే దేశం- ఒకే మార్కెట్'
వ్యవసాయ ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించే దిశగా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి రైతులకు మేలు చేకూర్చే దిశగా నిత్యావసర వస్తువుల చట్టానికి సవరణ చేపట్టేందుకు ఆమోదముద్ర వేసింది. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి.
చికెన్ గున్యా వ్యాక్సిన్ అభివృద్ధిలో భారత్ బయోటెక్
ప్రపంచ వ్యాప్తంగా అంటువ్యాధుల నిర్మూలనకు కృషి చేసే కొయిలేషన్ ఫర్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్స్ సంస్థ భారత్ బయోటెక్లతో ఒప్పందం కుదుర్చుకుంది. చికెన్ గున్యా వ్యాక్సిన్ అభివృద్ధికి ఈ ఒప్పందం కృషి చేస్తుంది. మరింత సమాచారానికై క్లిక్ చేయండి
మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు
భారత్‌తో సరిహద్దు వెంబడి పరిస్థితులు నిలకడగా ఉన్నట్టు చైనా పునరుద్ఘాటించింది. ఇరుదేశాల సమస్యలను పరిష్కరించడానికి ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని తేల్చి చెప్పింది. ఎందుకంటే?
ఫైల్ షేరింగ్ చేయాలా..?
వియ్ ట్రాన్స్‌ఫర్ వెబ్‌సైట్‌ను తాత్కాలికంగా నిలిపి వేయాలని టెలికం మంత్రిత్వ శాఖ (డీవోటీ) ఇటీవలే ఆదేశించింది. ఫలితంగా ఈ సైట్‌ను వినియోగించే వారు సందిగ్ధంలో పడ్డారు. ఈ తరుణంలో దానికి బదులుగా ఉన్న ఇతర సైట్లపై ఓ లుక్కేద్దాం.
త్వరలో సినిమా షూటింగ్‌లు!
చిత్రీకరణల అనుమతి కోసం తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు తయారు చేస్తోందని, త్వరలో దీనిని జారీ చేయనున్నట్లు నిర్మాత సి.కల్యాణ్ చెప్పారు. త్వరలో మొదలుపెడతాం!
క్రీడా పురస్కారాల నామినేషన్లపై ఓ షట్లర్ అసహనం
ప్రతిష్టాత్మక అర్జున పురస్కారం విషయంలో, తనను మరోసారి విస్మరించారని యువ షట్లర్ ప్రణయ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన కంటే తక్కువ ప్రతిభ గల వారిని బాయ్ నామినేట్ చేసిందని విచారం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో ట్వీట్ పోస్ట్ చేశాడు.