కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ మృతిపట్ల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సంతాపం తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. దేశం ఒక మహోన్నతమైన నాయకురాల్ని కోల్పోయిందన్నారు. ఆమె మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొన్నారు. ఆమె లేని లోటు పూడ్చలేనిదని తెలిపారు. సుష్మాస్వరాజ్ పదవులకు వన్నె తెచ్చిన గొప్ప నాయకురాలని చెప్పారు. ప్రతిపక్షనేతగా పార్లమెంటు వెలుపల, లోపల తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తి వెన్నుదన్నుగా నిలిచారన్నారు. గల్ఫ్‌దేశాల్లో తెలంగాణ వాసులు అనేక కేసుల్లో చిక్కుకుంటే... వెంటనే స్పందించి వారికి న్యాయం చేసి ఆ కుటంబాలకు అండగా ఉన్నారని కొనియడారు. సుష్మాస్వరాజ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయతోపాటు పలువురు నేతలు సుష్మాస్వరాజ్ మృతి పట్ల సంతాపం తెలిపారు.
ఇవీ చూడండి:తెలంగాణ చిన్నమ్మ ఇకలేరు