ETV Bharat / state

Covaxin Doses to Vietnam: మరోసారి ఉదారత చాటుకున్న భారత్‌ బయోటెక్‌

author img

By

Published : Dec 16, 2021, 10:00 PM IST

Covaxin Doses to Vietnam: భారత్‌ బయోటెక్‌ సంస్థ మరోసారి తన ఉదారతను చాటుకుంది. రెండు లక్షల కొవాగ్జిన్‌ టీకా డోసులను వియత్నాం ప్రభుత్వానికి ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. వియత్నాంకు చెందిన డంక్‌ మిన్‌ సంస్థతో కలిసి వితరణ చేయనున్నట్లు భారత్‌ బయోటెక్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్ర ఎల్ల చెప్పారు.

Covaxin Doses to Vietnam:  మరోసారి ఉదారత చాటుకున్న భారత్‌ బయోటెక్‌
Covaxin Doses to Vietnam: మరోసారి ఉదారత చాటుకున్న భారత్‌ బయోటెక్‌

Covaxin Doses to Vietnam: రిపబ్లిక్ ఆఫ్ వియత్నాంకు డంక్ మిన్​తో కలిసి 2 లక్షల కొవాగ్జిన్​ డోస్​లు వితరణ చేయనున్నట్టు భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్ల ప్రకటించారు. సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం అధ్యక్షుడు విరోంగ్‌ దిన్‌ హ్యు ఆధ్వర్యంలో దిల్లీలో జరిగిన కార్యక్రమంలో సుచిత్ర ఎల్ల పాల్గొన్నారు. కొవాగ్జిన్​ వితరణ స్నేహానికి చిహ్నమని పేర్కొన్న సుచిత్రా ఎల్ల... వియత్నాంలోనూ కొవాగ్జిన్​ అత్యవసర వినియోగ అనుమతి సాధించినట్లు ప్రకటించారు. కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కోవడంలో కొవాగ్జిన్‌ టీకా పరిధిని మరింత విస్తృతం చేసేందుకు ఈ విరాళం దోహదపడుతుందని ఆమె పేర్కొన్నారు. కొవాగ్జిన్‌కు సంబంధించి సాంకేతిక బదిలీ, టీకా సరఫరా, సహకారంపై చర్చించేందుకు వియత్నాం తమను ఆహ్వానించడం పట్ల సుచిత్ర ఎల్ల హర్షం వ్యక్తం చేశారు.

ఈ వితరణ ద్వారా వియత్నాంలో వ్యాక్సినేషన్​ను మరింత వేగవంతం చేయడానికి ఉపయోగపడుతుందని సుచిత్ర ఎల్ల అభిప్రాయపడ్డారు. మరోవైపు 2 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు వారి కోసం తయారు చేసిన వ్యాక్సిన్ ఇప్పటికే 3 దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తి అయిన నేపథ్యంలో ఆ వివరాలు సీడీఎస్ సీఓకు సమర్పించామని డాక్టర్ కృష్ణా ఎల్ల పేర్కొన్నారు. పిల్లల వ్యాక్సిన్​కి అనుమతి లభిస్తే... చిన్నారులకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఫలితంగా మహమ్మారిని మరింత సమర్థంగా ఎదుర్కోగలమన్నారు.

ఇదీ చదవండి:

Telangana Omicron Cases: మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదు... ఏడుకు చేరిన సంఖ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.