ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రంగా పెరుగుతోన్న సమయంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్.. స్వదేశీ వాక్సిన్ను క్లినికల్ ట్రయిల్స్‌ని ప్రారంభించింది. భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ రాష్ట్రంలో నేటి నుంచి ప్రారంభమయ్యాయి.
దేశవ్యాప్తంగా 12 ఇన్స్టిట్యూషన్స్...
దేశ వ్యాప్తంగా మొత్తం 12 ఇన్స్టిట్యూషన్స్ను ఐసీఎంఆర్ క్లినికల్ ట్రయల్స్ కోసం ఎంపిక చేయగా... రాష్ట్రానికి చెందిన నిమ్స్ ఆస్పత్రికి సైతం అందులో స్థానం లభించింది. దీనితో క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొనే వారికోసం ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఐసీయూని నిమ్స్ రూపొందించింది. ఎథికాక్ కమిటీ పచ్చజెండా ఊపడంతో ఈనెల 7న వలంటీర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించింది. మొత్తం 12 మందికి సంబంధించి రక్త నమూనాలను ఐసీఎంఆర్‌కి పంపగా... అందులో ఆరోగ్యవంతులను ఐసీఎంఆర్ ధృవీకరించింది. అలా క్లినికల్ ట్రయల్స్‌కి ఎంపికైన వారిలో ఇద్దరికి ఇవాళ నిమ్స్‌లో తొలివిడత వ్యాక్సిన్‌ని ఇచ్చినట్లు వైద్యులు స్పష్టం చేశారు.
పలు రాష్ట్రాల్లో ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. దిల్లీ ఎయిమ్స్, నిమ్స్‌లలో ఇవాళ ట్రయల్స్ ప్రారంభిమయ్యాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 375 మందిని ట్రయల్స్ కోసం ఐసీఎంఆర్ ఎంపిక చేసినట్టు గతంలోనే ప్రకటించింది.
ఒకసారి వ్యాక్సిన్ ఇచ్చిన తరువాత 2 రోజుల పాటు వారిని ఆసుపత్రిలో ఉంచి ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తారు. అనంతరం డిశ్చార్జ్ చేసి 14 రోజుల పాటు వారి ఆరోగ్య సమాచారాన్ని గమనిస్తారు. ఆ నివేదికలను ఐసీఎంఆర్‌కి పంపి రివ్యూ చేస్తారు. మొదటి డోస్ తీసుకున్న వారు ఆరోగ్యంగా ఉంటే 14 రోజుల తరువాత 2వ డోస్ ఇవ్వనున్నారు.
వ్యాక్సిన్ రెండు డోస్‌లు పూర్తి అయ్యాక మూడో డోస్ ఇచ్చి ఎఫీకసీ పరీక్షిస్తారు. అన్ని దశాల్లోనూ వ్యాక్సిన్ మంచి ఫలితాలను ఇచ్చినట్లు రుజువైతే ఆ వ్యాక్సిన్ మానవులకు ఇచ్చేందుకే అర్హత సాధించినట్టు అవుతుంది. ఈ ప్రక్రిలను పూర్తి చేసి ఆగస్ట్ 15 నాటికి వ్యాక్సిన్‌ని అందుబాటులోకి తీసుకురావాలని ఐసీఎంఆర్ భావిస్తోంది.
ఇవీ చూడండి: మంత్రి ఔదార్యం.. తన వాహనంలో ఆస్పత్రికి క్షతగాత్రుడు