కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఆమోదంపై భారత్ బయోటెక్ స్పందించింది. శాస్త్రవేత్తలు, వాలంటీర్లకు ఈ విజయం అంకితమని భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. 123 దేశాలకు సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. ప్రపంచ ప్రఖ్యాత జర్నల్స్‌లో భారత్ బయోటెక్‌పై వ్యాసాలు వచ్చాయని తెలిపారు. తాము యూకేలో కూడా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని చెప్పారు.
భారత్ బయోటెక్ దేశానికి సంబంధించినదే కాదు.. ఓ గ్లోబల్ కంపెనీ అని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ల విషయంలో తమకు గ్లోబల్ లీడర్‌షిప్ ఉందని ప్రకటించారు. అనేక దేశాల్లో భారత్ బయోటెక్‌కు భాగస్వాములున్నారని వివరించారు. చికున్ గున్యా సహా అనేక వ్యాధులకు తాము వ్యాక్సిన్లు తయారు చేశామన్నారు.
గతంలో తక్కువ మందిపై ప్రయోగాలు చేసిన విదేశీ కంపెనీలు అనుమతులు పొందాయని వ్యాఖ్యానించారు. కొవాగ్జిన్ సురక్షితమైన ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్‌ని హామీనిచ్చారు.
ఇదీ చూడండి: మన టీకా కోసం ప్రపంచం ఎదురుచూడటం గర్వకారణం: తమిళిసై