ఏడాదిగా కొవిడ్ సంక్షోభంలో ముందుండి పోరాడుతోన్న పోలీసుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని బియాండ్ లైఫ్ ఫౌండేషన్ అనే సంస్థ.. వారికి ఎన్-95 మాస్కులను పంపిణీ చేసింది. సంస్థ వ్యవస్థాపకులు నర్సింగ్‌రావు.. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పీఎస్‌కు చెందిన 50 మందికి మాస్క్‌తో పాటు.. ఫేస్ షీల్డ్, స్టిమర్లను అందజేశారు.
కరోనా కట్టడిలో భాగంగా ఏడాది కాలంగా పోలీసులు చేస్తోన్న సేవలు ఎనలేనివని నర్సింగ్‌రావు కొనియాడారు. అలుపెరుగకుండా విధులు నిర్వర్తిస్తోన్న వారికి తమ వంతుగా సాయం చేసినట్లు వివరించారు.
ఇదీ చదవండి: లాక్డౌన్ విధించడంతో తప్పని వలసకూలీల కష్టాలు