ETV Bharat / state

Beer sales increased: ఎండ సుర్రుమంటోంది.. బీరు పొంగిపారుతోంది..!

Beer sales increased: వేసవితాపం అధికమవుతుండడంతో రాష్ట్రంలో బీరు అమ్మకాలు భారీగా పెరిగాయి. మార్చి నుంచి ఇప్పటివరకు 42 రోజుల్లో 5.30 కోట్లు లీటర్ల బీరు అమ్ముడు పోగా.. 3.59 కోట్లు లీటర్లు లిక్కర్‌ విక్రయాలు జరిగాయి. అంతకుముందు ఏడాది కంటే 40.46 శాతం అధికంగా బీర్లు విక్రయాలు జరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

Beer sales increased: ఎండ సుర్రుమంటోంది.. బీరు పొంగిపోతోంది..!

author img

By

Published : Apr 13, 2022, 5:39 AM IST

Updated : Apr 13, 2022, 8:26 AM IST

Beer sales increased: రాష్ట్రంలో బీర్లు అమ్మకాలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. ఎండ వేడిమి అధికం కావడంతో బీర్లు వాడకం అనూహ్యంగా పెరుగుతోందని అబ్కారీ శాఖ అంచనా వేస్తోంది. వేసవి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం 42 రోజుల్లోనే 40.46 శాతం బీర్లు అధికంగా అమ్ముడు పోయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతేడాది మార్చి ఒకటి నుంచి ఏప్రిల్‌ 11 వరకు రూ.3,302.78 కోట్లు విలువైన 3.78 కోట్ల లీటర్ల బీరు, 3.56 కోట్లు లీటర్లు లిక్కర్‌ విక్రయాలు జరిగాయి. కాగా.. 2022 మార్చి ఒకటి నుంచి ఏప్రిల్‌ 11వ తేదీ వరకు 42 రోజుల్లో రూ.3,614.91 కోట్లు విలువైన 5.30కోట్లు లీటర్లు బీరు, 3.58 కోట్లు లీటర్లు లిక్కర్‌ అమ్ముడు పోయింది. 2021 మార్చి ఒకటి నుంచి ఏప్రిల్‌ 11 వరకు జరిగిన బీరు విక్రయాల కంటే 40.46శాతం అధికంగా.. అంటే 1.53 కోట్ల లీటర్ల బీరు అధికంగా అమ్ముడు పోయింది. అదే విధంగా.. 2021 మార్చి ఒకటి నుంచి ఏప్రిల్‌ 11 వరకు 3.56 కోట్ల లీటర్లు లిక్కర్‌ విక్రయాలు జరగ్గా.. ఈ ఏడాది అదే 42 రోజుల్లో రూ.3.59కోట్లు లీటర్లు లిక్కర్‌ అమ్ముడు పోయింది. దీన్నిబట్టి చూస్తే.. చాలా స్వల్పంగా లిక్కర్‌ విక్రయాలు పెరిగాయని అబ్కారీ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఏప్రిల్​లో పగటిపూట ఉష్ట్రోగ్రతలు భారీగా పెరుగుతుండడంతో బీరు అమ్మకాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నెల ఒకటి నుంచి ఇప్పటివరకు జరిగిన బీరు, లిక్కర్‌ అమ్మకాలను పరిశీలిస్తే.. 2021 ఏప్రిల్‌ నెలలో 11 రోజుల్లో 84.64 లక్షల లీటర్లు లిక్కర్‌, 1.11 కోట్ల లీటర్ల బీరు అమ్ముడు పోగా.. ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటి ఉంచి 11వ తేదీ వరకు 74.94 లక్షల లీటర్ల లిక్కర్‌.. 1.39కోట్లు లీటర్లు బీరు అమ్ముడు పోయింది. దాదాపు పది లక్షల లీటర్లు లిక్కర్‌ అమ్మకాలు తగ్గగా.. 28 లక్షల లీటర్లు బీరు అధికంగా విక్రయాలు జరిగినట్లు అబ్కారీ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి.

ఈ నెల ఆరు నుంచి 11 వరకు జరిగిన అమ్మకాలను రోజువారిగా పరిశీలించిననట్లయితే.. రోజూ వందకోట్లకు తక్కువ లేకుండా మద్యం అమ్ముడు పోతుండగా.. అందులో రోజుకు 90వేల లీటర్లు వరకు లిక్కర్‌ అమ్ముడుపోతుంటే.. లక్షా 60వేల లీటర్లు నుంచి లక్షా 80వేల లీటర్లు వరకు బీరు విక్రయాలు జరుగుతున్నాయి. వర్క్‌ ఫ్రం హోం నుంచి కార్యాలయాలకు వచ్చి పని చేసేట్లు బహుళ జాతి కంపెనీలు చర్యలు తీసుకుంటుంటుండడం.. ఈ నెల, వచ్చే నెల ఎండలు మరింత ముదిరే అవకాశం ఉండడంతో బీరు అమ్మకాలు మరింత పెరుగుతాయని అబ్కారీ శాఖ అంచనా వేస్తోంది.

ఇవీ చూడండి:

రాష్ట్రంలో భానుడి ప్రతాపం... గరిష్ఠ ఉష్ట్రోగ్రత ఎక్కడంటే..!

లక్ష్యం చేరేదాక యుద్ధం ఆగదు: పుతిన్​

Last Updated : Apr 13, 2022, 8:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.