ETV Bharat / state

తగ్గని కేసులు.. ఆగని మరణాలు.. పడకలు లేక ఇక్కట్లు! - Covid Effect on AP

ఆంధ్రప్రదేశ్​లోని పలు ఆసుపత్రుల్లో ఐసీయూ, ఆక్సిజన్‌ పడకల కొరతతో రోగులు అల్లాడుతున్నారు. క్యాజువాలిటీ విభాగాల్లో గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది. ఇద్దరు, ముగ్గురు రోగులకు కలిపి ఒకే మంచం దిక్కవుతోంది. దానిపైనే వరుసగా నిద్రిస్తున్నారు. మరికొందరు స్థలం లేక నేలపై పడుకుంటున్నారు.

beds-shortage-in-government-hospitals-for-covid-patients
తగ్గని కేసులు.. ఆగని మరణాలు.. పడకలు లేక ఇక్కట్లు!
author img

By

Published : May 8, 2021, 7:41 AM IST

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఆసుపత్రిలో కొంత భాగాన్ని కొవిడ్‌ విభాగం కిందికి మార్చి 1,211 పడకలు అందుబాటులోకి తెచ్చారు. అవన్నీ నిండిపోవడంతో పడక ఖాళీ అయినంతవరకు క్యాజువాలిటీలోనే రోగి, అతడి సహాయకులు నిరీక్షించాల్సి వస్తోంది. కాకినాడ ఆసుపత్రికి ఉభయగోదావరి జిల్లాలతోపాటు విశాఖ జిల్లా శివారు ప్రాంత రోగులు వస్తుంటారు. రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రిలోనూ పడకల కోసం పడిగాపులు తప్పడం లేదు.

ఇక్కడున్న 53 ఐసీయూ, 347 ఆక్సిజన్‌ బెడ్లు కొద్ది రోజులుగా పూర్తిగా నిండిపోతున్నాయి. జిల్లాలోని 77 ఆసుపత్రుల్లో 4,461 పడకలు కొవిడ్‌ సేవలకు కేటాయించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే బొమ్మూరు, బోడసకుర్రు, కాకినాడలో కొవిడ్‌ కేర్‌సెంటర్లు అందుబాటులోకి తెచ్చారు. ఇక్కడ ఆరు వేల పడకలున్నాయి. ఆయాచోట్ల అదనంగా అత్యవసర పడకలను సమకూర్చాల్సి ఉంది.

తగ్గని కేసులు.. ఆగని మరణాలు

తొలి, రెండో విడతలో కలిపి రాష్ట్రంలో అత్యధిక కేసులు తూర్పుగోదావరి జిల్లాలో నమోదయ్యాయి. పాజిటివ్‌ కేసుల సంఖ్య 1.58 లక్షలు సమీపించగా.. శుక్రవారంనాటికి యాక్టివ్‌ కేసులు 20,924 ఉన్నాయి. కాకినాడ జీజీహెచ్‌లో రోజుకు 20కిపైనే మరణాలు నమోదవుతున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నవారిని ఇతర మరణాలుగా చూపించి మిగిలినవి మాత్రమే కరోనా లెక్కల్లో చూపిస్తున్నారు. రాజమహేంద్రవరంలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో మరణాలు సైతం లెక్కల్లోకి రావడంలేదు.

కర్నూలులో పడకలు లేక ఇక్కట్లు

కర్నూలు సర్వజన వైద్యశాలలోని కొవిడ్‌ అత్యవసర విభాగం(ట్రైయేజ్‌)లో రోగులకు పడకలు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. కొందరు నేలపైనే చికిత్స పొందుతుండగా, అలాంటి వారికి ఆక్సిజన్‌ పెట్టే పరిస్థితి లేక నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలు దొరకడం లేదు. పెద్దాస్పత్రిలో కొవిడ్‌ అత్యవసర విభాగంలో 70 పడకలు ఉండగా, అత్యవసర చికిత్స అందించిన అనంతరం వార్డులకు తరలిస్తారు. ఈ విభాగంలో సరైన వైద్యం అందక పలువురు మృత్యువాత పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. రాత్రివేళల్లో పరిస్థితులు మరీ దారుణంగా ఉంటున్నాయని బాధితులు వాపోతున్నారు.

ఇదీ చదవండి: సత్ఫలితాలనిస్తున్న భరోసా కేంద్రాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.