బ్యూటీ రంగంలో వస్తున్న మార్పులతోపాటు నిపుణులకు సంబంధించిన అంతర్జాతీయ సదస్సుకు నగరం వేదిక కానుంది. బ్యూటీ అండ్ ల్యాండ్ పేరుతో ఈనెల 11 న హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో సదస్సును ప్రారంభించనున్నారు. సదస్సుకు సంబంధించి పోస్టర్ను ఆవిష్కరించనున్నారు. సౌందర్య, ఆరోగ్యం, చర్మ సంబంధమైన ఉత్పత్తుల్లో అంతర్జాతీయంగా పేరొందిన 30 బ్రాండ్‌లు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు సంహిత తెలిపారు. చర్మ సంరక్షణ కోసం ఆయుర్వేదం నుంచి కె-బ్యూటీ వరకు కావలిసిన ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయన్నారు.
ఇదీ చూడండి :ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టుకు ఎన్సీ