ETV Bharat / state

ఆ చెరువులు నీళ్ల కోసమే కాదు... ఆహ్లాదానికి కూడా! - హైదరాబాద్‌ చెరువు వార్తలు

హైదరాబాద్‌లోని జల వనరులను ఆక్రమణల నుంచి కాపాడటంతోపాటు సందర్శనీయ ప్రాంతాలుగా అధికారులు తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం 17 తటాకాల పనులు తుది దశకు వచ్చాయి. నెల రోజుల్లో సుమారు పది చెరువుల పనులు పూర్తవుతాయని, వాటిని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని యంత్రాంగం ధీమా వ్యక్తం చేస్తోంది.

cheruvu
cheruvu
author img

By

Published : Jul 20, 2020, 9:33 AM IST

హైదరాబాద్‌లో చెరువుల శుద్ధి, సుందరీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రెండేళ్ల క్రితం రూ.287.97 కోట్లతో 19 చెరువుల అభివృద్ధికి ఏర్పాట్లు మొదలవగా.. ప్రస్తుతం 17 తటాకాల పనులు తుది దశకు వచ్చాయి.

జల వనరులను ఆక్రమణల నుంచి కాపాడటంతోపాటు సందర్శనీయ ప్రాంతాలుగా అధికారులు తీర్చిదిద్దుతున్నారు. చుట్టూ కంచె నిర్మించడం, కాలిబాట ఏర్పాటు, అలంకరణ మొక్కల పెంపకం, మొక్కలు నాటడం, పిల్లలు ఆడుకునే పార్కుల నిర్మాణం, పచ్చిక బయళ్ల అభివృద్ధి, ఇతరత్రా సౌకర్యాలు కల్పిస్తున్నారు. నెల రోజుల్లో సుమారు పది చెరువుల పనులు పూర్తవుతాయని, వాటిని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని యంత్రాంగం ధీమా వ్యక్తం చేస్తోంది.

వర్షాకాలం అనంతరం ఆహ్లాదం..

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఒకప్పుడు 600లకు పైగా జలవనరులుండేవి. గొలుసుకట్టు చెరువులకు నగరం ప్రసిద్ధి. ఆక్రమణల దెబ్బతో ప్రస్తుతం 185 మిగిలాయి. అవీ కబ్జా కోరల్లో చిక్కుకున్నవే. ఇప్పటికే సగానికిపైగా విస్తీర్ణం కోల్పోయాయి. వీటి సంరక్షణపై అధికారులు రెండేళ్ల క్రితం చుట్టూ కంచె నిర్మించి, సుందరీకరణ పనులు చేపట్టేందుకు నడుం బిగించారు. ప్రభుత్వం అందుకు అనుమతిచ్చింది.

వివాదాలు, ఇతరత్రా సమస్యలతో పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని, ప్రస్తుతం వేగం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. మురుగునీటి శుద్ధి కేంద్రాలు(ఎస్టీపీ), పిల్లలు ఆడుకునేందుకు పార్కులు, వాకింగ్‌ ట్రాక్‌లు, సైకిల్‌ ట్రాక్‌లు, సేద తీరే ప్రాంతాలు, బోటింగ్‌, బహిరంగ వ్యాయామశాలలు, ఇతర సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని అంటున్నారు. వర్షాకాలం అనంతరం ఆయా నీటి వనరుల వద్ద ఆహ్లాదకరమైన వాతావరణం సాకారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కబ్జాలు జరగకుండా కంచె..

ఇప్పటి వరకు జరిగిన కబ్జాల సంగతి అటుంచి, ఇకపై చెరువు స్థలంలోకి ఎవరూ ప్రవేశించకుండా బల్దియా తటాకాల చుట్టూ కంచె నిర్మిస్తోంది. అందుకు సంబంధించిన పనులు దాదాపు పూర్తయ్యాయి. రంగదాముని(ఐడీఎల్‌లేక్‌) చెరువులో కంచె నిర్మాణంతోపాటు గణపతి నిమజ్జన కోనేరు పనులూ పూర్తయ్యాయి. ఖాజాకుంటలో కంచె పూర్తయి, కాలిబాట పనులు పురోగతిలో ఉన్నాయి. ముళ్లకత్వచెరువులో నిమజ్జన కోనేరు అందుబాటులోకి వచ్చింది.

కామునిచెరువులో కంచె నిర్మాణం పురోగతిలో ఉంది. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద ఓ నిర్మాణ సంస్థ పనులు చేపట్టింది. సున్నం చెరువు, మైసమ్మచెరువులకు కంచె నిర్మాణం పూర్తయినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ చాలా ప్రాంతాల్లో అసంపూర్తిగా ఉంది. మీరాలంచెరువు, సరూర్‌నగర్‌, పెద్దచెరువు, నల్లచెరువు, ఇతరత్రా తటాకాల అభివృద్ధి పనులు తుదిదశలో ఉన్నాయి.

ఇదీ చదవండి: నరకయాతన: అద్దె ఇళ్లలో ఉండనివ్వరు.. దవాఖానాల్లో చేర్చుకోరు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.