హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి విద్యార్థుల సమావేశాన్ని నిర్వహించారు. మెడికల్ కౌన్సెలింగ్‌కు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. మెడికల్ కౌన్సెలింగ్ లో నిర్లక్ష్యం వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన 262 మంది విద్యార్థులు సీట్లను కోల్పోవాల్సి వచ్చిందని ఆర్. కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సెలింగ్‌పై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలన్నారు. జరిగిన అన్యాయంపై రాష్ట్రపతిని కలిసి విన్నవించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేస్తున్నదని... ఈ వైఖరి విడనాడకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని కృష్ణయ్య హెచ్చరించారు. విద్యార్థులు నాయకత్వ లక్షణాల్ని అలవరుచుకొని పోరాడాలన్నారు.
ఇదీ చూడండి :టాటా ఏస్‌లో 58 మంది.. వీడియో వైరల్