ETV Bharat / state

BC MLA Ticket Issue in Congress Party : కాంగ్రెస్​లో బీసీ నేతల పోరుబాట.. 34 సీట్లు తమకే ప్రకటించాలని డిమాండ్ - BC MLA Ticket Issue in Congress Party

BC MLA Ticket Issue in Congress Party :తెలంగాణా కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే టికెట్ల కోసం.. బీసీలు పోరుబాట పడుతున్నారు. టికెట్ల కేటాయింపులో తమకు అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్న వారు.. కాంగ్రెస్‌ అగ్రనేతలను కలవాలని నిర్ణయించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలతో పాటు.. దిల్లీ వెళ్లి సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలతోపాటు మల్లిఖార్జున ఖర్గేలను కలువనున్నట్లు ప్రకటించారు. రాజకీయ వ్యవహారాల కమిటీలో ప్రకటించిన 34 నియోజకవర్గాల్లో నైనా బీసీలకు ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Congress
Telangana Congress
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 24, 2023, 9:18 PM IST

BC MLA Ticket Issue in Congress Party in Telangana : తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ (Congress Party)ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతుండగా.. అధిక జనాభా కలిగి ఉన్న బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్రంలోని 119 నియోజక వర్గాల్లో కులాలవారీగా ఓటర్లను పరిశీలించినప్పుడు.. 48 నియోజకవర్గాల్లో బీసీల ఓట్లు అధికంగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు తమకు టికెట్లు కేటాయించాలని బీసీ నేతలు గత కొన్ని రోజులుగా డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు.

Telangana Congress Joinings : కాంగ్రెస్‌లో చేరేందుకు యత్నించిన పలువురికి భంగపాటు.. సిట్టింగ్ ఎమ్మెల్యేలకూ తప్పలేదు!

BC Leaders Raise Voice in congress Tickets : ఇటీవల జరిగిన పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీలో ఇదే అంశం చర్చకు రాగా.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఒక్కో పార్లమెంట్​కు రెండేసి చొప్పున 34 నియోజకవర్గాలను బీసీలకు కేటాయించేందుకు పార్టీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం టికెట్ల కేటాయింపు కసరత్తు ముమ్మరంగా సాగుతున్న వేళ.. ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ, స్క్రీనింగ్‌ కమిటీలో.. బీసీలకు న్యాయం చేసే రీతిలో కొనసాగడం లేదని గాంధీభవన్‌లో జరిగిన భేటీలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సమావేశానికి వి.హనుమంతురావు, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్‌, సురేశ్​ షెట్కర్‌, మహేశ్‌కుమార్‌ గౌడ్‌, కత్తి వెంకటస్వామి తదితరులు హాజరై.. తాజా పరిణామాలపై చర్చించారు. దాదాపు మూడు గంటలపాటు కొనసాగిన ఈ సమావేశంలో టికెట్ల కేటాయింపుపైనే చర్చ కొనసాగింది. అధిక జనాభా కలిగి ఉన్నబీసీలు తమ హక్కుల కోసం పోరాటం చేసేందుకు సిద్ధం కావాలని.. బీసీ సీనియర్‌ నాయకులు ( BC Leaders Raise Voice in congress Tickets ) పిలుపునిచ్చారు.

Revanth Reddy on Congress Candidates Announcement : 'త్వరలోనే తొలి విడతలో సగానికిపైగా సీట్లలో అభ్యర్థులను ప్రకటిస్తాం'

మెతకగా ఉన్నట్లయితే న్యాయం జరగదని బీసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు పోరాటం చేయడం తప్పనిసరని పేర్కొన్నారు. జనాభా దామాషా ప్రకారం టికెట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఉన్నత వర్గాలకు చెందిన వారు.. బీసీల కోసం సీట్లు త్యాగం చేయాలని కోరుతున్నారు. గతంలో పీఏసీ సమావేశంలో.. తన సీటు బీసీలకు ఇచ్చేందుకు సిద్ధమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారని బీసీ నాయకులు గుర్తు చేశారు. ఆయన అదే మాట మీద నిలబడాలని వారు సూచించారు.

పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా.. బీసీ టికెట్లు ఆశిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాలను పరిశీలిస్తే..

  • కరీంనగర్‌ పార్లమెంట్​ పరిధిలో- హుస్నాబాద్‌, వేములవాడ, కరీంనగర్‌, సిరిసిల్ల
  • పెద్దపల్లి పార్లమెంట్‌ పరిధిలో- రామగుండం, పెద్దపల్లి
  • అదిలాబాద్‌ పార్లమెంట్​ పరిధిలో- ఆదిలాబాద్, సిర్పూర్, ముథోల్​,
  • నిజామాబాద్​ పార్లమెంట్‌ పరిధిలో- ఆర్మూర్, బాన్సువాడ, నిజామాబాద్‌ అర్బన్‌,
  • మెదక్ పార్లమెంట్‌ పరిధిలో- దుబ్బాక, పటాన్​చెరువు, నర్సాపూర్, సిద్దిపేట,
  • జహీరాబాద్ పార్లమెంట్‌ పరిధిలో- బాన్సు​వాడ, నారాయణఖేడ్,
  • మల్కాజ్​గిరి పార్లమెంట్ పరిధిలో- మేడ్చల్, మల్కాజిగిరి, ఎల్బీనగర్
  • సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో- ముషీరాబాద్, అంబర్​పేట్, సనత్‌నగర్‌, సికింద్రాబాద్‌,
  • చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో- రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి
  • మహబూబ్​నగర్ పార్లమెంట్ పరిధిలో- నారాయణపేట, షాద్​నగర్, దేవరకద్ర, మక్తల్, గద్వాల్, కొల్లాపూర్

Assembly Constituencies Expecting BC Tickets : నల్గొండ పార్లమెంట్‌ పరిధిలో.. నల్గొండ,.. భువనగిరి పార్లమెంట్ పరిధిలో.. మునుగోడు, ఆలేరు, జనగామ నియోజకవర్గాలను తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ పార్లమెంట్‌ పరిధిలో.. వరంగల్ ఈస్ట్, పరకాల, మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో నర్సంపేట, ఖమ్మం పార్లమెంట్ పరిధిలో కొత్తగూడెం నియోజకవర్గాలు ఉన్నాయి.

హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో మలక్​పేట, గోషామహల్ నియోజకవర్గాలు తమకు కేటాయించాలని బీసీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు సీట్ల కేటాయింపు కొనసాగుతున్న వేళ బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరేందుకు దిల్లీ వెళ్లాలని నిర్ణయించారు. పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గేను కలిసి అడగనున్నట్లు వారు తెలిపారు.

Congress Ticket War in Palamuru : ఉమ్మడి పాలమూరులో కాంగ్రెస్ టికెట్​ దక్కించుకునేదెవరు..?

Congress Bus Yatra in Telangana : బస్సు యాత్రకు కాంగ్రెస్‌ ప్లాన్.. త్వరలోనే రూట్‌మ్యాప్‌, షెడ్యూల్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.