వైన్స్షాపు ఓనర్లు అమ్మకాలపైనే దృష్టి పెడుతున్నారు తప్ప ప్రజల ఆరోగ్యం గురించి ఏ మాత్రం పట్టించుకోవడంలేదని బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉపేంద్రమ్మ యాదవ్ ఆరోపించారు. హైదరాబాద్ కొత్తపేటలోని ఓ మద్యం దుకాణంలో కాలపరిమితి దాటిన రెండు కాటన్ల బీర్లను విక్రయించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాటిని కొనుగోలు చేసిన ఓ వ్యక్తి కాల పరిమితి దాటిపోయిందని బీర్లను తిరిగి దుకాణదారునికి చూపించి ఇదేంటని ప్రశ్నిస్తే.. నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడని ఆమె పేర్కొన్నారు. దుకాణం యజమానిపై ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేయనున్నామని.. వెంటనే ఆ దుకాణం లైసెన్స్ రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
ఇదీచూడండి: విశాఖ ఘటనపై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష