హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద సద్దుల బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. పెద్దసంఖ్యలో వచ్చిన మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించారు. అర్ధరాత్రి వరకు ఉయ్యాల పాటలు పాడుతూ.... చిన్న పెద్ద తేడా లేకుండా ఉత్సాహాంగా ఆటలాడుతూ హోరెత్తించారు. అనంతరం హుస్సేన్‌సాగర్‌లో గౌరమ్మను నిమజ్జనం చేశారు.
కూకట్‌పల్లి రామాలయం వద్ద మహిళలంతా చేరి.... బతుకమ్మ ఆడారు. ముషీరాబాద్‌లో సద్దుల బతుకమ్మ వేడుకలు కోలాహలంగా జరిగాయి. మహిళలతో కలిసి ఎమ్మెల్యే ముఠా గోపాల్ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ వేడుకల్లో పాల్గొన్నారు.
ఇదీ చదవండిః రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ అధికారుల బదిలీ