ఈనెల 8న గోల్కొండ కోటలో బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తున్నట్లు భాజపా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి (Bjp Mahila Morcha State President GeethaMurthi) వెల్లడించారు. మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. ఇందుకు సంబంధించిన బతుకమ్మ సంబురాలు గోడ పత్రికను మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి(Ex Mla Ramchadra Reddy)తో కలిసి భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
బతుకమ్మ పండుగలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని గీతామూర్తి అన్నారు. బతుకమ్మ పండుగను జాతీయ పండుగగా గుర్తించాలని మాజీ ఎమ్మెల్యే రాంచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి బతుకమ్మ పండుగను జాతీయ పండుగగా గుర్తించాలని మహిళా మోర్చా నేతలు వినతిపత్రం ఇవ్వనున్నారని తెలిపారు. బతుకమ్మ పండుగలో మహిళా మోర్చా రాష్ట్ర నాయకత్వం ప్రతిరోజు ఒక్కో జిల్లాలో పాల్గొంటుందని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఇదీ చూడండి: