బద్దం బాల్‌రెడ్డి మరణవార్త విని కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ దిగ్భ్రాంతికి లోనయ్యారు. భారత జాతీయ భావ సిద్ధాంతాలకు తీరని నష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. బాల్‌రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
నా రాజకీయ గురువు: కిషన్ రెడ్డి
కార్యకర్తల నుంచి నాయకులుగా ఎదిగిన ఎంతో మందికి బాల్రెడ్డిఆదర్శమని భాజపా నేత కిషన్ రెడ్డి తెలిపారు. శాసనసభ్యుడిగా ఎలా నడుచుకోవాలో ఆయన నుంచే నేర్చుకున్నానని వెల్లడించారు. అలుపెరగని పోరాట యోధుడని చెప్పుకొచ్చారు. బాల్‌రెడ్డి మరణం భాజపాకు తీరని లోటని అన్నారు.కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఇదీ చదవండికార్వాన్ టైగర్ కన్నుమూత