బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో సుమారు 60,000 చీరలను పంపిణీ చేసినట్లు ఆయన వెల్లడించారు.
పేదింటి ఆడపడుచులు అందరితో సమానంగా కొత్త చీరలు ధరించి పండుగ జరుపుకోవాలని ఆకాక్షించారు. చేనేత కార్మికులను ఆదుకోవడం కోసం వారికే ఈ చీరల తయారీ పనులను కేటాయించినట్లు తెలిపారు. 18 ఏళ్లు నిండి రేషన్కార్డుల్లో పేరు కలిగిన అన్నిమతాలు, కులాల మహిళలకు చీరలు అందించేలా ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి గతేడాది 34,685 మంది మాత్రమే చీరలు పొందగా ఈసారి ఐదు డివిజన్లలో కలిపి 60,580 మందికి అందించనున్నారు.
ఇవీ చూడండి : ఆత్మహత్య చేసుకోమని మహిళకు తోటి ఉద్యోగుల వేధింపులు