Banjarahills CI Bribe Case : హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో సీఐగా విధులు నిర్వహిస్తున్న.. నరేందర్ లంచం డిమాండ్ చేస్తూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. బంజారాహిల్స్‌లోని ఓ పబ్ ఓపెనింగ్‌కు యజమాని నుంచి రూ.3 లక్షలు డిమాండ్ చేస్తూ అనిశా అధికారులకు పట్టుబడ్డారు. అవినీతి ఆరోపణలపై బంజారాహిల్స్ ఠాణాలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సీఐని ప్రశ్నిస్తున్న అధికారులు, నరేందర్ నివాసంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్‌లో సీజ్ చేసిన పబ్‌ను తిరిగి ప్రారంభించడానికి సీఐ నరేందర్.. రూ.3 లక్షలు డిమాండ్ చేయడంతో పబ్ యజమాని అనిశా అధికారులను ఆశ్రయించారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు నరేందర్‌ను విచారిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎస్‌ఐ నవీన్‌రెడ్డి, హోం గార్డు హరిని కూడా విచారిస్తున్నారు. లంచం డిమాండ్ చేసినందుకు ఏసీబీ కేసు నమోదు చేసింది. గతంలో రాక్‌క్లబ్ పబ్‌లో యువతులతో అసభ్య నృత్యాలు చేయిస్తున్నారని సీఐ నరేందర్ పబ్‌ను సీజ్ చేశారు. పబ్‌ను తిరిగి ఓపెన్ చేయాలంటే లంచం ఇవ్వాలంటూ.. సీఐ డిమాండ్ చేశారని పబ్ యాజమాని పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వాలంటూ సీఐ, ఎస్సై, హోంగార్డ్ ఒత్తిడి భరించలేక బాధితుడు అనిశాను అశ్రయించాడు.
ACB Raids in Telangana : కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో ఏమైనా పనులు కావాలంటే ముడుపులు ముట్టజెప్పాల్సిందే. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ దాడులు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. కొందరు 'అవినీతి' అధికారులు.. పనుల కోసం వచ్చిన ప్రజల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. బాధితులు ఏసీబీని ఆశ్రయించడంతో లంచం తీసుకుంటుండగా.. అనిశాకు పట్టుడుతున్నారు. ఇటీవల రంగారెడ్డి జిల్లా ఆర్డేడీ విజయలక్ష్మి కార్యాలయంలో.. పాఠశాలను అప్‌గ్రేడ్ చేసేందుకు లంచం డిమాండ్ చేసినట్లుగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు రావడంతో నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆదిలాబాద్ మావలా తహసీల్దార్.. భూమిని పట్టా చేసేందుకు లంచం డిమాండ్ చేయడంతో.. రైతు ఫిర్యాదు మేరకు డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు.
ACB Raids in Marriguda MRO Home : అవినీతి నిరోధక శాఖ(Anti Corruption Bureau) సోదాల్లో నల్గొండ జిల్లా మర్రిగూడ తహసీల్దార్ మంచిరెడ్డి మహేందర్‌రెడ్డి(MRO Mahindar Reddy) అక్రమార్జన బయటపడింది. ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టాడనే ఆరోపణలు రావడంతో ఏసీబీ(ACB) అధికారులు ఏకకాలంలో 15 చోట్ల సోదాలు నిర్వహించారు. మహేందర్ రెడ్డి ఇంట్లో భారీగా నగదు, బంగారం, ఇతర ఆస్తులను గుర్తించారు.
ఈ తనిఖీల్లో ఇంట్లోని ఓ ట్రంకు పెట్టెలో భారీగా దాచిన నోట్లకట్టలు బయటపడ్డాయి. ఆ పెట్టెను కట్టర్ సాయంతో తెరిచి.. నగదును లెక్కించగా.. రూ.2.7 కోట్లు ఉన్నట్లు తేలింది. ఇతర చర, స్థిరాస్తులు కలిపి.. మొత్తం వాటి విలువ రూ.4.56 కోట్ల వరకు ఉంటుందని అధికారులు గుర్తించారు. ఈ సోదాల్లో కిలోకు పైగా బంగారం కూడా దొరికినట్టు సమాచారం. మహేందర్ రెడ్డి స్థిరాస్తి వ్యవహారాలు సైతం నడిపిస్తున్నాడని ఏసీబీ భావిస్తోంది. మరోవైపు అతని కుటుంబ సభ్యులు, సమీప బంధువుల ఇళ్లతో పాటు.. మర్రిగూడ ఎమ్మార్వో కార్యాలయంలోనూ అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేశారు.
TU VC Ravinder Caught by ACB Officials : ఏసీబీకి చిక్కిన తెలంగాణ వర్సిటీ వీసీ రవీందర్