బతుకమ్మ పండుగకు జాతీయస్థాయిలో గుర్తింపు రావాల్సిన అవసరముందని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఇందుకు తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. రైల్వే పొరుగు సేవలు, ఒప్పంద కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఇందిరాపార్కులో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన దత్తాత్రేయ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంప్రదాయమని పేర్కొన్నారు. మహిళలను అన్ని రంగాల్లో భాగస్వాములను చేసినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని దత్తాత్రేయ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : పోషకాహార లోపాన్ని అధిగమిస్తాం: మంత్రి సత్యవతి రాఠోడ్