ETV Bharat / state

'కరోనాపై స్పష్టమైన హెల్త్ బులెటిన్ విడుదల చేయాలి'​ - telangana governoment Should release a clear health bulletin on Corona

కరోనా పాజిటివ్​ కేసులపై స్పష్టమైన హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్​ చేశారు.

carona virus positive cases latest news in Telangana

author img

By

Published : Apr 3, 2020, 9:07 PM IST

దిల్లీ నుంచి తెలంగాణకు వచ్చిన వారి వివరాలు వెల్లడించాలని రాష్ట్ర సర్కారును భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ కోరారు. ఎంత మంది వచ్చారో స్పష్టమైన సంఖ్య ఇవ్వకుండా ఎవరి మెప్పు కోసమో ప్రభుత్వం భయపడుతోందని ఆరోపించారు.

జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసులు ప్రకటిస్తే ప్రజలు అప్రమత్తంగా ఉంటారని పేర్కొన్నారు. ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్, సీఎంవో ప్రకటించే లెక్కలకు సంబంధం ఉండట్లేదని ఆరోపించారు. ప్రజలు ఆరోగ్య శాఖని నమ్మాలో లేదో అనే సందిగ్ధంలో ఉన్నారన్నారు. గంట వ్యవధిలోనే సీఎం అధికారిక ప్రకటనకి.. ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌కి పొంతన ఉండటం లేదని దుయ్యబట్టారు. కరోనాపై స్పష్టమైన హెల్త్ బులెటిన్ ఆరోగ్యశాఖ నుంచి విడుదల చేయాలని బండి సంజయ్​ డిమాండ్​ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.