ETV Bharat / state

తనపై నమోదైన కేసు విషయంలో.. పీఎస్‌కు వెళ్లిన బండి సంజయ్ కుమారుడు

author img

By

Published : Jan 18, 2023, 3:28 PM IST

బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ న్యాయవాదితో కలిసి దుండిగల్ పోలీస్ స్టేషన్​లో హాజరయ్యారు. తనపై నమోదైన కేసు విషయమై ఆయన స్టేషన్​కు వెళ్లారు. విచారణలో పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని బండి భగీరథ తరఫు న్యాయవాది కరుణసాగర్‌ వెల్లడించారు.

Bandi Bhagirath
Bandi Bhagirath

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ న్యాయవాదితో కలిసి పోలీస్ స్టేషన్​కు వెళ్లారు. తనపై నమోదైన కేసు విషయంలో స్టేషన్​లో ఆయన హాజరయ్యారు. బండి భగీరథపై దుండిగల్ పీఎస్‌లో కేసు నమోదైందని.. ఈ విషయం సామాజిక మాధ్యమాల ద్వారా తమకు తెలిసిందని బండి భగీరథ తరఫు న్యాయవాది కరుణసాగర్‌ చెప్పారు. కేసు విషయాన్ని నిర్ధారించుకునేందుకు ఇక్కడికి వచ్చామని తెలిపారు. కేసు ప్రాథమిక దశలోనే ఉందని పోలీసులు చెప్పారని ఆయన పేర్కొన్నారు. ఆధారాలు సేకరించిన తర్వాత.. పిలుస్తామని చెప్పినట్లు తెలిపారు. విచారణలో పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని కరుణసాగర్‌ వెల్లడించారు.

తమ మధ్య అభిప్రాయ భేదాలు సృష్టించేందుకే: బండి భగీరథ మహీంద్ర వర్సిటీలో మేనేజ్​మెంట్ కోర్సు చదువుతున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం శ్రీరామ్ అనే విద్యార్థిని దూషిస్తూ దాడి చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. దీనిపై విశ్వ విద్యాలయ క్రమశిక్షణా సంఘం ప్రతినిధులు బండి భగీరథపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా దుండిగల్ పోలీసులు బండి భగీరథ పలు సెక్షన్ల కింద నిన్న కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే బాధిత విద్యార్థి వీడియో సైతం బయటికి వచ్చింది. భగీరథ తనకు మిత్రుడేనని.. తాము ఇరువురు స్నేహంగానే ఉన్నామంటూ ఓ వీడియో విడుదల చేశాడు. తమ మధ్య అభిప్రాయ భేదాలు సృష్టించేందుకే దాడికి సంబంధించిన వీడియోను బహిర్గతం చేశారని పేర్కొన్నాడు.

సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే తనతో రాజకీయం చేయాలి: తన కుమారుడిపై నమోదైన కేసు విషయంపై బండి సంజయ్ స్పందించారు. సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే తనతో రాజకీయం చేయాలని పేర్కొన్నారు. అలా చేయడం చేతగాక తట్టుకోలేక.. తన కుమారుడిని లాగుతున్నారని తెలిపారు. కేసీఆర్‌ మనవడి విషయంలో కొందరు తప్పు వ్యాఖ్యలు చేస్తే తాను ఖండించానని బండి సంజయ్ గుర్తు చేశారు.

చిన్న పిల్లలను రాజకీయాల్లోకి లాగొద్దనే సోయి కేసీఆర్‌కు లేదని బండి సంజయ్ విమర్శించారు. ఎప్పుడో జరిగిన దానిని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చి ఇప్పుడు కేసు పెట్టిస్తారా అని ప్రశ్నించారు. తన కుమారుడిపై ఫిర్యాదు చేసిందెవరు? కళాశాల వాళ్లు కనీసం విచారణ చేశారా? నోటీసు ఇచ్చారా? కౌన్సెలింగ్‌ చేశారా? కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలని వారికి తెలియదా? అని బండి సంజయ్‌ నిలదీశారు.

ఇవీ చదవండి: చిక్కుల్లో బండి సంజయ్ కుమారుడు తోటి విద్యార్థిని కొట్టినందుకు కేసు నమోదు

యాదాద్రి సన్నిధిలో జాతీయ నేతలు.. కేసీఆర్​తో కలిసి ప్రత్యేక పూజలు

మూడు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా.. షెడ్యూల్​ ప్రకటించిన ఈసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.