Bandi Sanjay on Telangana RTC Bill : రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Governor Tamilisai) తాజాగా ఆర్టీసీ విలీన బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనిపై బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్(BJP National Secretary Bandi Sanjay) స్పందించారు. తక్షణమే ఆర్టీసీ కార్మికుల విలీన ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల విలీన బిల్లును గవర్నర్ తమిళిసై ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్మికులకు ఇబ్బంది రాకూడదనే బిల్లును గవర్నర్ అధ్యయనం చేశారని సంజయ్ పేర్కొన్నారు. కేసీఆర్ సర్కార్ ఓట్లు కోసమే తూతూ మంత్రంగా ఆర్టీసీ బిల్లును రూపొందించారని మండిపడ్డారు. ఎన్నికలు అయ్యాక కార్మికులను రోడ్డున పడేయాలని అనుకున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ కుట్రను అడ్డుకుని బిల్లులోని లోపాలను గవర్నర్ సరిదిద్దారని తెలిపారు.
CPI Leader Chada on Telangana RTC Merger Bill : గవర్నర్ తమిళిసై టీఎస్ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలుపడాన్ని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి(CPI Leader Chada Venkata Reddy) స్వాగతించారు. ఆర్టీసీ కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించి.. విలీన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఆయన కోరారు. ప్రభుత్వం, ఆర్టీసీ సంస్థ వాడుకున్న ఆర్టీసీ కార్మికుల సీసీఎస్ నిధులు(RTC Workers CS Funds) విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విశ్రాంత ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు, పీఎఫ్ నిధులు తక్షణమే విడుదల చేసి వేతన సవరణ చేయాలని పేర్కొన్నారు. కార్మికుల పని భారం తగ్గించాలని అన్నారు. ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని తెలిపారు.
Telangana RTC Merger Bill Approved : టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం చేసిన విషయం తెలిసిందే. అయితే తాను చేసిన 10 సిఫారసుల విషయంలో ప్రభుత్వ స్పందనపై సంతృప్తి చెందిన రాష్ట్ర గవర్నర్.. తాజాగా ఆ బిల్లును ఆమోదిస్తూ సంతకం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గవర్నర్ అభినందనలు చెప్పారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం(Telangana Government) శాసన సభలో బిల్లులను ప్రవేశపెట్టింది. వాటిని గవర్నర్ ఆమోదం కోసం పంపించగా.. దీనిపై ఆమె కొన్ని అంశాలపై అధికారుల వివరణ అడిగారు. అంతేకాకుండా గవర్నర్ 10 సిఫార్సులు చేశారు. వీటిపై ప్రభుత్వ వివరణతో సంతృప్తి చెందిన తమిళిసై.. తాజాగా బిల్లుకు ఆమోదం తెలిపారు.
Pending Bills Issue in Telangana : మళ్లీ రాజ్‌భవన్ చేరిన బిల్లుల కథ.. ఈసారి గవర్నర్ నిర్ణయమేంటో..?