ETV Bharat / state

బ్రెయిన్ స్ట్రోక్‌తో బీజేపీ కార్పొరేటర్ మృతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బండి సంజయ్ - తెలంగాణ తాజా వార్తలు

BJP Corporator Karunakar Died of Brain Stroke : గుడిమల్కాపూర్ బీజేపీ కార్పొరేటర్ కరుణాకర్ బ్రెయిన్ స్ట్రోక్​తో కన్నుమూశారు. రాత్రి ఒక్కసారిగా కుప్పకూలిన కార్పొరేటర్.. సిటీ న్యూరో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కార్పొరేటర్ మృతి పట్ల ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

బీజేపీ  కార్పొరేటర్ కరుణాకర్‌
బీజేపీ కార్పొరేటర్ కరుణాకర్‌
author img

By

Published : Jan 13, 2023, 3:10 PM IST

Updated : Jan 13, 2023, 3:29 PM IST

BJP Corporator Karunakar Died of Brain Stroke : గుడిమల్కాపూర్ బీజేపీ కార్పొరేటర్ కరుణాకర్ బ్రెయిన్ స్ట్రోక్​తో కన్నుమూశారు. రాత్రి ఒక్కసారిగా కుప్పకూలిన కార్పొరేటర్.. సిటీ న్యూరో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కార్పొరేటర్ మృతి పట్ల ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. కరుణాకర్ మరణించారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. రెండుసార్లు కార్పొరేటర్​గా పని చేశారని.. ప్రజలందరికీ సేవ చేయాలన్న దృక్పథం ఉన్న వ్యక్తని కొనియాడారు. అన్ని వర్గాల ప్రజలు గౌరవించి ఆత్మీయంగా పిలుచుకునే వ్యక్తి నేడు లేడనే వార్త బాధిస్తుందని విచారం వ్యక్తం చేశారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి దశాబ్దాలుగా కృషి చేస్తున్న వ్యక్తని.. కరోనా సమయంలో పేద ప్రజలకు భోజన సదుపాయం, నిత్యవసర వస్తువులు విరివిగా దానం చేశారని బండి పేర్కొన్నారు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలకు పాల్గొనడమే కాకుండా పార్టీ కార్యకర్తలను, ప్రజలను భాగస్వామ్యం చేయడం.. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన చేసిన కృషి నిర్విరామమని కొనియాడారు. దేవర కరుణాకర్ మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 13, 2023, 3:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.