Bandi Sanjay letter to SIT officials: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు నిన్న సిట్ అధికారులు రెండో సారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం 11 గంటలకు సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా విచారణకు హాజరు కాలేనని బండి సంజయ్ సిట్ అధికారులకు మరోమారు లేఖ రాశారు. ఈ లేఖను బీజేపీ లీగల్ టీం ద్వారా సిట్ అధికారులకు పంపించారు.
దీంతో బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధులు సిట్ అధికారుల వద్దకు వెళ్లి లేఖను సమర్పించారు. ఆ లేఖలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై నమ్మకం లేదని.. ఈ విషయం ముందు నుంచే తాను చెబుతున్నట్లు పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరగడం వలన తాను బిజీగా ఉన్నానని.. ఇంతకు ముందే ఈ విషయం సిట్ అధికారులకు స్పష్టం చేసినప్పటికీ మళ్లీ నోటీసును పునరావృతం చేయడానికి ఇష్టపడుతున్నారని లేఖలో పేర్కొన్నారు.
ఒక నిర్ధిష్ట గ్రామంలో పెద్ధ సంఖ్యలో ప్రజలు అనధికారికంగా అర్హులని కొన్ని స్వతంత్ర మూలాల ద్వారా తెలుసుకుని పబ్లిక్ డొమైన్‌లో ఉంచానని తెలిపారు. ప్రజా ప్రతినిధిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తాను అనేక మూలాల నుంచి సమాచారాన్ని పొందానని.. దానిని పబ్లిక్ డొమైన్‌లో ఉంచడం నా వంతు బాధ్యత అని సంజయ్ లేఖలో ప్రస్తావించారు. ఈ విషయాన్ని అనుసరించి సిట్ అధికారులు తనకు నోటీసులు అందించాలని ఎంచుకున్నారంటూ లేఖలో పేర్కొన్నారు.
BJP legal team for SIT office: ఈ లేఖను బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధులు సిట్ అధికారులకు అందించారు. తాము ఇచ్చిన లేఖపై సిట్ అధికారులు సంతృప్తికరంగా ఉన్నారంటూ లీగల్ టీం చెప్పుకొచ్చింది. అవసరమైతే మళ్లీ నోటీసులు ఇస్తామని సిట్ అధికారులు చెప్పారని తెలిపింది.
ఇదిలా ఉండగా.. ఈ విషయంలో సిట్ అధికారులు ఇప్పటికే బండి సంజయ్‌కు ఓసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన ఇంటి దగ్గర లేకపోవడంతో అవి ఆయన ఇంటి గోడకు అంటించి వెళ్లారు. దీనిపై స్పందించిన సంజయ్.. సిట్ అధికారులు తనకు నోటీసులు ఇవ్వలేదని.. తాను దినపత్రికల్లో చూసి తెలుసుకున్నాని చెప్పుకొచ్చారు. దీంతో మరోసారి సిట్ అధికారులు నిన్న బండి సంజయ్‌కు నోటీసులు ఇచ్చారు. ఇవాళ వ్యక్తిగతంగా సిట్ ముందు హాజరు కావాలని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఇదివరకే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా సిట్ ముందు హాజరై.. తన వద్ద ఉన్న ఆధారాలు సమర్పించారు.
ఇవీ చదవండి:
'మా నౌకరీలు మాగ్గావాలే'.. కేటీఆర్ రాజీనామా చేయాల్సిందే: బండి సంజయ్
TSPSCకి ఏ శాఖతోనూ సంబంధం ఉండదు: కేటీఆర్
'కేసీఆర్ ప్రభుత్వం అసత్యాలను మానుకొని.. వాస్తవాలను చెబితే హుందాగా ఉంటుంది'