ETV Bharat / state

Bandi Sanjay letter to CM KCR : 'సీఎం కేసీఆర్ మౌనం ఓఆర్​ఆర్​ టెండర్‌లో భారీ స్కామ్ జరిగిందనే అనుమానాలను బలపరుస్తోంది' - ఓఆర్‌ఆర్‌ లీజ్‌ వ్యహారంపై బండి సంజయ్‌ లేఖ

Bandi Sanjay letter to KCR on ORR Dispute : సీఎం కేసీఆర్‌ మౌనం ఓఆర్‌ఆర్‌ టెండర్‌లో భారీ స్కామ్‌ జరిగిందనే అనుమానాలను మరింత బలపరుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఓఆర్​ఆర్ టెండర్‌ నోటిఫికేషన్ దగ్గర నుంచి ఫైనలైజేషన్ వరకు గోప్యత పాటించడానికి కారణాలేంటని ప్రశ్నించారు. టోల్‌ టెండర్ల అప్పగింతపై వస్తున్న ఆరోపణలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తూ బండి సంజయ్ ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.

Bandi Sanjay
Bandi Sanjay
author img

By

Published : May 30, 2023, 8:32 PM IST

Bandi Sanjay letter to KCR on ORR Dispute : హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డు టోల్‌ టెండర్ల అప్పగింతపై వస్తున్న ఆరోపణలకు జవాబు చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌... సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఈ అంశంపై సీఎం మౌనం ఓఆర్​ఆర్​ టెండర్‌లో భారీ కుంభకోణం జరిగిందనే అనుమానాలను బలపరుస్తోందని బండి సంజయ్‌ లేఖలో పేర్కొన్నారు. ఓఆర్‌ఆర్‌ టెండర్‌ నోటిఫికేషన్ దగ్గర నుంచి ఫైనలైజేషన్ వరకు రహస్యంగా ఉంచడం వెనుక ఆంతర్యమేమిటని బండి సంజయ్ ప్రశ్నించారు.

టోల్ టెండర్‌లో జరిగిన అవకతవకలను ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలు, మీడియా సంస్థలను లీగల్ నోటీసులతో బెదిరించడం సిగ్గుచేటు అని సంజయ్ ఆక్షేపించారు. ఓఆర్ఆర్ టోల్ టెండర్ ద్వారా ప్రభుత్వానికి రూ.30 వేల కోట్లకుపైగా ఆదాయం సమకూరే అవకాశముండగా... అతి తక్కువ ధరకే టెండర్ కట్టబెట్టడం వెనుక ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. ఓఆర్‌ఆర్‌ టోల్ టెండర్‌ ప్రక్రియలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఏ మాత్రం చిత్తుశుద్ధి ఉన్నా తక్షణయే ఓఆర్ఆర్ టోల్ టెండర్ వ్యవహారంపై వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు.

IRB Legal Notices to Raghunandan Rao : హైదరాబాద్‌ అవుటర్‌ రింగ్‌ రోడ్‌ లీజ్‌ వ్యహారంపై దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘునందన్‌రావు చేసిన వ్యాఖ్యలపై ఐఆర్‌బీ సంస్థ పరువు నష్టం దావా వేసింది. సదరు సంస్థ ఆయనపై రూ.1000కోట్లు పరువు నష్టం వేసింది. ఈ మేరకు ఐఆర్‌బీ సంస్థ రఘునందన్‌రావుకు లీగల్‌ నోటీసులు జారీ చేసింది.

ORR.. కేసీఆర్‌కు భవిష్యత్‌లో ఏటీఎం : హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్వహణను ప్రభుత్వం అతి తక్కువ ధరకు ప్రైవేటు సంస్థకు కట్టబెట్టిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఓఆర్ఆర్‌.. భవిష్యత్‌లో సీఎం కేసీఆర్‌కు ఏటీఏంగా మారనుందని ఆయన విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రాగానే దీనిపై విచారణ చేస్తామని పేర్కొన్నారు.

'దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కంటే.. ఓఆర్‌ఆర్‌ లీజు వెయ్యిరెట్ల పెద్ద స్కామ్‌'

Revanth Reddy Comments on ORR Issue : ఓఆర్ఆర్‌ను ముంబయికి చెందిన ఓ కంపెనీకి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కట్టబెట్టిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సైతం గతంలో ఆరోపించారు. ఏడాదికి రూ.750 కోట్ల ఆదాయం వస్తోన్న ఓఆర్‌ఆర్‌ను రూ.246 కోట్లకే అమ్మేశారని రేవంత్‌ మండిపడ్డారు. హైదరాబాద్ మహా నగరానికి మణిహారంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.6వేల 696 కోట్లతో ఓఆర్ఆర్‌ను నిర్మించిందని గుర్తు చేశారు.

Arvind Kumar Clarity on ORR Tender Issue: తెలంగాణలో రాజకీయ అలజడి రేపుతున్న ఓఆర్‌ఆర్‌ లీజ్‌ ఆరోపణలపై గతంలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్​కుమార్ వివరణ ఇచ్చారు. ఔటర్ రింగ్ రోడ్ టీఓటీ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరిగిందని ప్రకటించారు. జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ విధివిధానాల ప్రకారమే వెళ్లినట్లు ఆయన స్పష్టం చేశారు. టీఓటీ బేస్ ప్రైస్ పెట్టాము కానీ బయటకు చెప్పలేదన్న అర్వింద్​ కుమార్.. ఎన్‌హెచ్‌ఏఐ కూడా బేస్ ప్రైస్ చెప్పడం లేదని తెలిపారు. బిడ్డింగ్​లో బేస్ ప్రైస్ కంటే ఎక్కువగా వచ్చిందని ఆయన వివరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.