ETV Bharat / state

Bandi Sanjay Fires on CM KCR : రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే.. బీజేపీ అధికారంలోకి రావాలి : బండి సంజయ్ - కేసీఆర్‌పై బండి సంజయ్ ఆరోపణలు

Bandi Sanjay Fires on CM KCR : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.5 లక్షల కోట్ల అప్పు చేశారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపించారు. బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటులో జాప్యానికి ముమ్మాటికీ కేసీఆరే కారకుడని బండి సంజయ్‌ విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని అన్నారు.

Bandi Sanjay
Bandi Sanjay in Raithu Sadassu in Hyderabad
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 14, 2023, 7:00 PM IST

Bandi Sanjay Fires on CM KCR : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నేత బండి సంజయ్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల కొంప ముంచిన చేపల పులుసు అంటూ సంజయ్‌ మండిపడ్డారు. వడ్ల కొనుగోలు టెండర్ల పేరుతో మరో రూ.500 కోట్లు దండుకునేందుకు సీఎంవో స్కెచ్‌ వేసిందని ఆరోపించారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ మైదానంలో బీజేపీ అధ్వర్యంలో కృష్ణా జలాల ట్రిబ్యునల్​పై నిర్వహించిన రైతు సదస్సుకు బండి సంజయ్‌ హాజరయ్యారు.

BJP Assembly Election Plan 2023 : బీసీ నినాదంతో జనంలోకి వెళ్లనున్న బీజేపీ..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రైతు సదస్సుకు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్‌ చౌదరి, బీజేపీ నేతలు మురళీధర్‌ రావు, ప్రేమేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటులో జాప్యానికి ముమ్మాటికి కేసీఆరే కారకుడని బండి సంజయ్‌ విమర్శించారు. మోటార్లకు మీటర్లు, సింగరేణి ప్రైవేటీకరణ ఒట్టి బూటకమని సంజయ్‌ తెలిపారు. కేసీఆర్‌ మోసాలకు బుద్ది చెప్పే టైమొచ్చిందన్నారు. బీఆర్‌ఎస్​ను ఓడించండి.. కేసీఆర్‌కు ఓటమి గిఫ్ట్‌గా ఇవ్వండంటూ పిలుపునిచ్చారు.

Nizamabad MP Arvind Fires on Congress Party : రేవంత్​ రెడ్డికి.. కర్ణాటక నుంచి తొలి విడతగా రూ.50 కోట్లు : ఎంపీ ధర్మపురి అర్వింద్

Bandi Sanjay Fires On KCR : తెలంగాణలో కేసీఆర్‌ రూ.5 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. ఆర్టీసీలో సరిగ్గా వేతనాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో సింగరేణి ఉద్యోగులకు అప్పు చేసి జీతాలు ఇచ్చే దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్రంలో ఉంటేనే న్యాయం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ భూములు అమ్మో.. మద్యం టెండర్‌ ద్వారా వచ్చిన సొమ్ముతోనో రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అంటే అది బురదలో పోసిన పన్నీరు అవుతుందని వ్యాఖ్యానించారు. మహిళలు, ఉద్యోగులు, యువత, నిరుద్యోగులు.. మన బతుకులు మారాలంటే ప్రభుత్వం మారాలి అని జోస్యం చెప్పారు.

Bandi Sanjay Concern on Pravallika Suicide in Chikkadpally : మరోవైపు ప్రవల్లిక ఆత్మహత్యపైనా సంజయ్ స్పందించారు. చిక్కడపల్లిలో ప్రవల్లిక ఆత్మహత్య చాలా బాధాకరమని.. విద్యార్థులు ధర్నా చేస్తుంటే వారిపై లాఠీ చార్జీ చేశారనీ మండిపడ్డారు. ఉద్యోగం కోసం ఆత్మహత్య చేసుకున్న ఘటనపై.. సీఎం ఇంకా స్పందించలేదని.. నిజంగా కేసీఆర్‌కు మానవత్వం లేదని విమర్శించారు. వాళ్ల కుటుంబసభ్యుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోకండని కోరారు. ఉద్యోగాల కోసం పోరాడాలని సూచించారు. ఉద్యోగాల కోసం పోరాడిన తనను జైలుకు పంపించారని.. బీజేపీ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు మొదటి కేబినెట్‌ సమావేశంలోనే ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

Kishan Reddy Comments on BRS and Congress : 'ప్రజలు కుటుంబ పార్టీల పాలన కోరుకోవడం లేదు'

BJYM Clashes in Hyderabad : బీజేపీలో అంతర్గత ముసలం.. బీజేవైఎం యువమోర్చా సమావేశం రసాభాస

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.