ETV Bharat / state

కవిత దందాలతో రాష్ట్ర మహిళలు తల దించుకునే పరిస్థితి: బండి సంజయ్‌ - కవిత లిక్కర్ స్కాంపై బండి సంజయ్ స్పందన

Bandi Sanjay Fires on State Government: రాష్ట్ర ప్రభుత్వంపై బండి సంజయ్ విమర్శనాస్త్రాలు సంధించారు. కల్వకుంట్ల కవిత చేసిన దందాలతో.. రాష్ట్ర మహిళలు తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద నిధులు లేవు కానీ.. కవిత లిక్కర్ దందా చేయడానికి వందల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయని బండి సంజయ్ ప్రశ్నించారు.

Bandi Sanjay
Bandi Sanjay
author img

By

Published : Mar 1, 2023, 3:05 PM IST

Bandi Sanjay Fires on State Government: రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. వైద్య విద్యార్థిని ప్రీతి నాయక్​ది ఆత్మహత్య కాదని.. హత్యేనని ఆరోపించారు. ఒక వర్గం ఓట్ల కోసం ప్రభుత్వం హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించిందని మండిపడ్డారు. తెలంగాణలో ఎక్కడా చూసిన హత్యలు,అత్యాచారాలు జరుగుతున్నాయనీ ఆవేదన వ్యక్తంచేశారు. హైదరాబాద్​లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో ఎస్టీ సామాజిక వర్గాన్ని బీఆర్​ఎస్ అణగదొక్కుతోందని బండి సంజయ్ ఆరోపించారు. మోదీ సర్కారు ఎస్టీని రాష్ట్రపతిని చేసిందని గుర్తు చేశారు. కానీ కేసీఆర్‌ సర్కారు ఎస్టీ యువతి ఆత్మహత్యకు కారణమైందని మండిపడ్డారు. మహిళ అని చూడకుండా వైఎస్ షర్మిలను దుర్భాషలాడుతున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ కుమార్తె చేసిన దందాల వల్ల రాష్ట్ర మహిళలు తల దించుకునే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.

కవిత లిక్కర్ దందా చేయడానికి వందల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయి?: ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద ఖజానా ఉండదు కానీ.. కవిత లిక్కర్ దందా చేయడానికి వందల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయో కేసీఅర్ చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు. బీజేపీ భిక్ష వల్లే కేసీఆర్ కుటుంబం బతుకులు బాగుపడ్డాయని.. బీజేపీ తెలంగాణకు మద్దతు ఇవ్వడం వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. కేసీఆర్​కు సీబీఐ, పోలీసులు కంటే మహిళా మోర్చా అంటేనే భయమని ఎద్దేవా చేశారు. కేసీఆర్ రాక్షసుడైనందునే.. మోదీ దేవుడు అయ్యారని పేర్కొన్నారు. దేశ ఆర్థిక మంత్రిగా మహిళను నియమించిన ఘనత ప్రధానిది అని తెలిపారు. కేంద్ర కేబినెట్‌లో 8 మంది మహిళలు ఉన్నారని వివరించారు. మోదీ సర్కారు మహిళలను ప్రోత్సహిస్తోందని బండి సంజయ్ వివరించారు.

కుమార్తెకు పదవులు కల్పిస్తే.. మహిళల అభివృద్ధికి కృషి చేసినట్లు కేసీఆర్ భావిస్తున్నారని బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతీ శ్రీనివాసన్ విమర్శించారు. మహిళల సాధికారతకి ప్రధాని పెద్ద పీట వేశారని తెలిపారు. ముద్ర యోజన ద్వారా 65శాతం మంది మహిళలు లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. కోట్లాది మంది మహిళలు నరేంద్ర మోదీ సంక్షేమ పథకాలతో లబ్ధి పొందుతున్నారని వనతీ శ్రీనివాసన్ వివరించారు.

"ఏ పార్టీలో మహిళా మోర్చా కూడా పనిచేయడం లేదు. బీఆర్ఎస్​లో కవిత మాత్రమే పనిచేస్తోంది. కేసీఆర్ కూతురు చేసే దందాల వల్ల రాష్ట్రంలోని మహిళలు తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. లిక్కర్ దందా చేయడానికి వందల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయో చెప్పాలి. ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ఆ మార్పు బీజేపీతోనే సాధ్యం." - బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

కవిత దందాలతో రాష్ట్ర మహిళలు తల దించుకునే పరిస్థితి: బండి సంజయ్‌

ఇవీ చదవండి: సిసోదియాలాగా త్వరలో కవిత కూడా జైలుకు వెళ్తారు: వివేక్‌ వెంకటస్వామి

కొద్దిరోజుల్లో కల్వకుంట్ల కవిత జైలుకెళ్లడం ఖాయం: అర్వింద్‌

బీర్కూర్ వేంకటేశ్వరస్వామి కల్యాణంలో కేసీఆర్ దంపతులు

లండన్​లో స్పీచ్​ కోసం రాహుల్​ గాంధీ కొత్త లుక్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.