ETV Bharat / state

Bandi Sanjay Fire On KCR And KTR : 'బీజేపీ-బీఆర్​ఎస్​ ఒక్కటనే భావనను కలిగించడానికే.. కేసీఆర్​ వ్యాఖ్యలు' - సీఎం కేసీఆర్​పై మండిపడ్డ బండి సంజయ్

Bandi Sanjay Participated In Meeting Organized By BJP : బీజేపీ-బీఆర్​ఎస్​ ఒక్కటనే భావనను కలిగించడానికే సీఎం కేసీఆర్​ నరేంద్రమోదీ మంచి మిత్రుడంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ విమర్శించారు. అనంతరం మంత్రి కేటీఆర్​పై ట్విటర్​లో విరుచుకుపడ్డారు. మాజీ కేంద్రమంత్రి ప్రకాశ్​ జవదేకర్​తో సమావేశంలో పాల్గొన్నారు.

Bandi Sanjay
Bandi Sanjay
author img

By

Published : Jun 16, 2023, 10:38 PM IST

Bandi Sanjay Fire On CM KCR : నరేంద్ర మోదీ తనకు మంచి మిత్రుడంటూ ముఖ్యమంత్రి కేసీఆర్​ చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఖండించారు. నరేంద్ర మోదీ పేరు వింటేనే కేసీఆర్​కు భయమని ఎద్దేవా చేశారు. ఆయన మాటల వెనుక కుట్రకోణం ఉందని ఆరోపించారు. ఇలాంటి వ్యాఖ్యలతో బీజేపీ-బీఆర్​ఎస్​ ఒక్కటేననే భావన కలిగించాలని.. తద్వారా తెలంగాణలో బీజేపీ గ్రాఫ్​ను దెబ్బతీయాలన్నదే సీఎం కేసీఆర్​ వ్యూహమని అభిప్రాయపడ్డారు. జూబ్లీహిల్స్​ అసెంబ్లీ నియోజకవర్గ సంయుక్త మోర్చాల సమావేశానికి బండి సంజయ్​తో పాటు కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్​ జవదేకర్​ హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్​ఎస్​, కాంగ్రెస్​లపై విరుచుకుపడ్డారు.

ఇప్పుడు కాంగ్రెస్​ గ్రాఫ్​ను పెంచేందుకే కేసీఆర్​ నానా తంటాలు పడుతున్నారని బండి సంజయ్​ పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ ఎప్పుడో చచ్చిపోయిందని.. జాకీ పెట్టిలేపినా లేచే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అమలయ్యే ఏ సంక్షేమ పథకాన్ని కూడా మేం తీసివేయమని.. మరింత మెరుగ్గా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ధరణి పోర్టల్​ కేసీఆర్​ కుటుంబానికే ఉపయోగపడిందని.. అందులోని లోపాలను సరిదిద్ది రైతులకు నష్టం జరగకుండా చూస్తామని మాట ఇచ్చారు.

Bandi Sanjay Tweet On KTR​ : మిస్టర్​ ట్విటర్​ టిల్లు పోరాటమే పుట్టిందే ఈ గడ్డలో.. అందరూ కలసి పోరాడితేనే పుట్టింది ఈ రాష్ట్రమంటూ బండి సంజయ్​ ట్వీట్​ చేశారు. ఒక్కడి వల్ల రాలేదు తెలంగాణ - అందరూ ఒక్కటైతే వచ్చిందే తెలంగాణ అని అన్నారు. మీ నాయన వల్ల రాలేదు తెలంగాణ - ఒక్కడి సొత్తు కాదు తెలంగాణ అంటూ ట్వీట్​ చేశారు. అధికార అహంకారం ఎక్కువై అమరుల త్యాగాలను కించపరిస్తే సహించదు తెలంగాణ సమాజమని ట్విటర్​ ద్వారా హెచ్చరించారు.

  • Mr. #TwitterTillu

    పోరాటం పుట్టిందే ఈ గడ్డలో.... అందరూ కలిసి పోరాడితేనే పుట్టింది ఈ రాష్ట్రం

    ఒక్కడి వల్ల రాలేదు తెలంగాణ - అందరూ ఒక్కటైతే వచ్చింది తెలంగాణ

    మీ నాయన వల్ల రాలేదు తెలంగాణ - ఒకడి అబ్బ సొత్తు కాదు తెలంగాణ

    అధికార అహంకారం ఎక్కువై అమరుల త్యాగాలను కించపరిస్తే సహించదు…

    — Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) June 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఎప్పుడు ఎన్నికలు వచ్చిన బీజేపీకి అధికారం ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఏ సర్వేలు చూసినా బీజేపీకు అనుకూలంగానే సర్వే రిపోర్టులు వస్తున్నాయి. దీన్ని గ్రహించిన బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ ఇద్దరూ కుమ్మక్కై బీజేపీ గ్రాఫ్​ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అంతా ప్లాన్​ ప్రకారమే జరుగుతోంది. నరేంద్ర మోదీని కేసీఆర్​ మిత్రుడని చెప్పడం అంతా ఫ్లాన్​లో భాగమే." - బండి సంజయ్​, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

కేసీఆర్​ ఒక్క హామీలను నెరవేర్చలేదు : తెలంగాణ వ్యాప్తంగా కుటుంబ పాలన కొనసాగిస్తున్న కేసీఆర్​ పాలన మొత్తం దోపిడీ, అవినీతిమయమని మాజీ కేంద్రమంత్రి ప్రకాశ్​ జవదేకర్​ విమర్శించారు. కేసీఆర్​ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు దళితులకే సీఎం పదవి ఇస్తానన్నారు ఇచ్చారా? డబుల్​ బెడ్​ రూం ఇండ్లు? దళితులకు మూడెకరాల భూమి? రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇచ్చారా అని ప్రశ్నించారు.

బీజేపీ-బీఆర్​ఎస్​ ఒక్కటనే భావనను కలిగించడానికే.. కేసీఆర్​ వ్యాఖ్యలు

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.