ETV Bharat / state

Bandisanjay fire on Harish Rao : 'బీఆర్‌ఎస్‌ చేస్తోన్న అవినీతిని గవర్నర్ చూస్తూ ఊరుకోవాలా?' - Bandi Sanjay latest news

Bandi Sanjay condemned Harish Rao comments : గవర్నర్​పై మంత్రి హరీశ్​ రావు చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. రబ్బరు స్టాంపు మాదిరి ఉండే గవర్నర్లు మాత్రమే బీఆర్ఎస్​కు నచ్చుతారని ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. నిజాయితీగా ఉండే గవర్నర్ అధికార బీఆర్​ఎస్​కు నచ్చడం లేదని ఘాటుగా విమర్శించారు. రిటైర్డ్ డీజీపీ ఎస్.కె.జయచంద్ర ఆయన కుమార్తె పాయల్ నేహాకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Bandi Sanjay
Bandi Sanjay
author img

By

Published : Jun 29, 2023, 3:23 PM IST

Bandisanjay fires on CM KCR : సీఎంఓలో కొంతమందితో కేసీఆర్ డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రిటైర్డ్ అయిన 500 మంది అధికారులను అడ్డుపెట్టుకుని ఏటా వెయ్యి కోట్లు సంపాదించడమే లక్ష్యంగా కేసీఆర్ పనిచేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. ఈ చివరి ఘడియల్లోనైనా ఆ అధికారులు ఆలోచనను మార్చుకుని తెలంగాణ భవిష్యత్ కోసం పనిచేయాలని కోరారు. హైదరాబాద్​లోని ఆ పార్టీ కార్యాలయంలో బండి సజయ్‌ మాట్లాడారు.

ఈ సందర్భంగా రిటైర్డ్ డీజీపీ ఎస్.కె.జయచంద్ర ఆయన కుమార్తె పాయల్ నేహాను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ సిద్దాంతాలు, ప్రధాని మోదీ విధానాలు నచ్చి ఎస్.కె.జయచంద్ర, ఆయన కుమార్తె పాయల్ నేహాలు పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. నిస్వార్థంగా పనిచేసే రిటైర్డ్ అధికారులు బీజేపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో కూడా చాలా మంది నేతలు పార్టీ చేరబోతున్నారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిని ఆకాంక్షించే మేధావి వర్గం బీజేపీలో చేరాలని విజ్ఞప్తి చేశారు.

Bandi Sanjay on eetala : రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తారన్న ప్రచారంలో.. వాస్తవం లేదు

Bandi Sanjay condemned Harish Rao comments : గవర్నర్​ తమిళిసై సౌందర రాజన్​పై మంత్రి హరీశ్​ రావు చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. రబ్బరు స్టాంపు మాదిరి ఉండే గవర్నర్లు మాత్రమే బీఆర్ఎస్​కు నచ్చుతారని ఎద్దేవా చేశారు. నిజాయితీగా ఉండే గవర్నర్ అధికార బీఆర్​ఎస్​కు నచ్చడం లేదని ఘాటుగా విమర్శించారు. గవర్నర్​ను హేళనకు గురిచేయడం రాజ్యాంగాన్ని అవమానించటమేనన్నారు.

బీఆర్​ఎస్ చేస్తోన్న అవినీతిని గవర్నర్ చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. సీఎం ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని.. అందుకే ప్రజలు రాజ్‌భవన్ వైపు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ మహారాష్ట్రకు ముఖ్యమంత్రా..? తెలంగాణకు ముఖ్యమంత్రా..? చెప్పాలని డిమాండ్ చేశారు.

"కొందరు ఉద్యోగులు డబ్బులు సంపాదిస్తూ కేసీఆర్‌ కుటుంబానికి పరోక్షంగా సాయం చేస్తున్నారు. దీని వల్ల తెలంగాణ ఎంతో నష్టపోతుంది. ఇవాళ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన లేదు. అప్పులతో ఇబ్బంది పడుతోంది. అధికారులు ఇకనైనా తప్పు తెలుసుకొని అవినీతి ఆపండి. రబ్బరు స్టాంప్‌ గవర్నర్లు మాత్రమే బీఆర్‌ఎస్‌కు నచ్చుతారు. గవర్నర్‌ను హేళన చేయడం రాజ్యాంగాన్ని అవమానించటమే. బీఆర్‌ఎస్‌ చేస్తోన్న అవినీతిని గవర్నర్ చూస్తూ ఊరుకోవాలా?. సీఎం అందుబాటులో లేరనే ప్రజలు రాజ్‌భవన్ వైపు చూస్తున్నారు"- బండి సంజయ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

JP Nadda phone call to Bandisanjay : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గత రాత్రి బండి సంజయ్‌కు ఫోన్ చేశారు. 'మహా జన్ సంపర్క్ అభియాన్‌'లో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. జులై 8వ తేదీన హైదరాబాద్‌లో జరిగే 11రాష్ట్రాల అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శుల సమావేశం ఏర్పాట్లపై నడ్డా ఆరా తీశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలు మరింత ఉత్సాహంతో పని చేయాలని బండి సంజయ్‌కు దిశా నిర్దేశం చేశారు.

'బీఆర్‌ఎస్‌ చేస్తోన్న అవినీతిని గవర్నర్ చూస్తూ ఊరుకోవాలా..?'

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.