రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యల పట్ల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువత ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్క లేదని విమర్శించారు. రోజుకు ఒకరు బలవుతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వలేదన్న బాధతోనే నిరుద్యోగులు చనిపోతున్నారని తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం తరవాత కూడా యువత ఆత్మహత్యలు బాధ కలిగిస్తున్నాయని అన్నారు. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఎప్పుడిస్తారో సీఎం స్పష్టం చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.