Bandi Sanjay Chit Chat With Media : బీజేపీలో సీనియర్లంటే బాస్లనీ.. కానీ కాంగ్రెస్‌లో హోంగార్డులతో సమానమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. దేశంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్లే గల్లంతు చేసుకుంటోందని విమర్శించారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్లపై కీలక వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెడ్డి లాగ పార్టీలు మారడం తనకు చేతకాదని.. ఆయనలాగా ఓటుకు నోటు కేసులో డబ్బులు పంచడం తెలియదని బండి సంజయ్ విమర్శలు చేశారు. తనకు పార్టీ నడపడం రాదని చెబుతున్న రేవంత్.. ఏ విధంగా పార్టీని నడిపిస్తున్నారో జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, జగ్గారెడ్డి వంటి కాంగ్రెస్ నేతలను అడిగితే తెలుస్తోందని తెలియజేశారు. బీజేపీ, కాంగ్రెస్‌లలో పార్టీని ఎవరు బాగా నడుపుతున్నారో.. కాంగ్రెస్ ఎవరి చెప్పు చేతల్లో ఉందో ప్రజలే గమనిస్తున్నారన్నారు.
Bandi Sanjay Comments On Congress : హుజురాబాద్, దుబ్బాక, జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా ఎందుకు రాలేదో తెలంగాణ ప్రజానికం ఆలోచించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు క్యాండెంట్లు దొరకడం లేదని ప్రశ్నించారు. సొంత పార్టీ నేతలపైనే సోషల్ మీడియాలో విమర్శలు చేయడం తనకు చేతకాదని బండి సంజయ్ అన్నారు. తాము గెలుపు పరంపరను కొనసాగిస్తే.. కాంగ్రెస్ ఓటముల పరంపర కొనసాగిస్తోందన్నారు.
Bandi Sanjay Chit Chat : రాష్ట్రంలో బీజేపీ ఎక్కడుందో మంత్రి కేటీఆర్ అంటున్నారు.. దానికి సమాధానం కావాలంటే సీఎంనే అడగాలని బండి సంజయ్ బదులిచ్చారు. తెలంగాణ సమాజంలో బీఆర్ఎస్ ఉందో.. బీజేపీ ఉందో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే తెలిసిపోయిందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీకి అసలు డిపాజిట్లు రావని బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు హేళన చేశారని గుర్తు చేశారు. కానీ ఆ ఎన్నికల్లో తాను 20 సీట్లు మాత్రమే వస్తాయని అనుకుంటే.. ఏకంగా 48 కార్పొరేటర్ స్థానాలు సాధించామన్నారు. ప్రజల్లో తాము ఉన్నామని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముందని అదే తన సమాధానం అన్నారు.
తండ్రి పేరు చెప్పి సీఎంలు అయ్యే పార్టీ కాదు : బీజేపీది కుటుంబ పార్టీ కాదని.. తండ్రి పేరు చెప్పి కుమార్తె, కుమారుడు సీఎంలు అయ్యే పార్టీ అసలు కాదని స్పష్టం చేశారు. ఓవైసీ ఎందుకు తెలంగాణ ఆవిర్బావ దినోత్సవానికి రాలేదని బీఆర్ఎస్, కాంగ్రెస్‌లను ప్రశ్నించారు. ఎంఐఎం పార్టీని నిజమైన తెలంగాణ ముస్లింలు వ్యతిరేకించాలని.. తెలంగాణ ఆవిర్భావంలో జెండా ఎగరవేయని వ్యక్తికి పోటీ చేసే అర్హత లేదని చెప్పారు. ఆర్నెళ్లల్లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దారుస్సలాంను స్వాధీనం చేసుకొని.. పేద ముస్లింలకు ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు. 17 సెప్టెంబరు విమోచన దినోత్సవాన్ని అధికారంగా నిర్వహించాం.. తెలంగాణ ఆవిర్భావాన్ని కూడా అధికారంగా నిర్వహించామని ఈ సందర్భంగా వివరించారు.
ఇవీ చదవండి :