మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తండ్రి ప్రొఫెసర్ ఎన్‌వీఆర్‌ఎల్‌ఎం రావు మృతిపట్ల హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రొఫెసర్ రావు అందరితో కలుపుగోలుగా మాట్లాడే వారని దత్తాత్రేయ తెలిపారు.
ఆయన మృతితో తాను అత్యంత ఆప్తున్ని కోల్పోయానని బండారు దత్తాత్రేయ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: CM KCR REVIEW: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై అధికారులతో సీఎం భేటీ