అనాదిగా జరుపుకుంటున్న వనదేవతల జాతరకు కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు చేయాలని రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్ రాజ్యసభలో కోరారు. జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ. 77 కోట్ల నిధులు కేటాయించిందన్నారు. కేంద్రం సహకారంతో జాతరలో మరిన్ని ఏర్పాట్లు సమకూర్చవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. జాతరను జాతీయ ఆదివాసుల పండుగగా ప్రకటించాలని రాష్ట్రపతిని కోరారు.
గతంలో ముఖ్యమంత్రులు, ఇతర రాజ్యసభ సభ్యులు ప్రస్తావించినా.. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శించిందని... ఇప్పటికైనా రాష్ట్రంలో విద్యావ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టాలని లింగయ్య యాదవ్ కోరారు. సూర్యాపేటలో కేంద్రీయ విద్యాలయాలకు భూసేకరణ చేసినా.. కేంద్రం నుంచి అనుమతులు రాలేదని లింగయ్య తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 32 కొత్త జిల్లాలకు గానూ 21 జవహర్ నవోదయ పాఠశాలలు, 17 కేంద్రీయ విద్యాలయాలు, మూడు సైనిక్ స్కూళ్లను మంజూరు చేయాలని ఉపరాష్ట్రపతిని కోరారు.
ఇవీ చూడండి: 'కరోనా'.. పాముల ద్వారా కాదు గబ్బిలాల వల్లేవ్యాప్తి!