చైనా రాఖీలు కొనడమంటే శత్రు దేశానికి ఆర్థిక లాభం చేకూర్చినట్లవుతుందని హిందూ జన జాగృతి కార్యకర్తలు పిలుపునిచ్చారు. ఆ దేశ వస్తువులను, రాఖీలను బహిష్కరించాలని కోరుతూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదుట ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చైనా రాఖీలను నిషేధించాలని హిందూ జనజాగృతి సమితి రాష్ట్ర కోఆర్డినేటర్ చేతన్ గాడి పిలుపునిచ్చారు. ఆర్టికల్ 370 విషయంలో పాకిస్తాన్‌కు చైనా వత్తాసు పలుకుతూ భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడిందని ఆరోపించారు.
ఇదీ చూడండి :ముఖాముఖి: ఐదేళ్లైనా అయ్యర్‌ను వీడని 'చాయ్‌వాలా'