BALKAMPETA YELLAMMA: హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. హైదరాబాద్ అమీర్ పేటలోని ఆలయంలో కల్యాణ క్రతువు నిర్వహిస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం తరపున పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆలయం వద్ద పోలీస్ శాఖ పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసింది.
రేపు (బుధవారం) అమ్మవారికి రథోత్సవం నిర్వహించనున్నారు. ఇందుకోసం భక్తులు భారీగా తరలివస్తారని అంచనా వేస్తున్న అధికారులు.. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. రథోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేస్తున్నారు.
ఇవీ చూడండి.. Balkampet Yellamma: 'అమ్మవారి కల్యాణానికి పటిష్ఠ భద్రత ఏర్పాట్లు'