ETV Bharat / state

నేటి నుంచి బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవాలు - బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవాలు తాజా వార్తలు

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవాలు సోమవారం నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్నారు. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు మహాగణపతి పూజతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. అయితే కరోనా మహమ్మారి కారణంగా భక్తులు ఎవరూ ఆలయానికి రావొద్దని అధికారులు సూచించారు.

నేటి నుంచి బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవాలు

author img

By

Published : Jun 22, 2020, 9:33 AM IST

హైదరాబాద్‌ బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవాలు సోమవారం నుంచి 3 రోజుల పాటు నిర్వహించడానికి దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. సోమవారం సాయంత్రం 5 గంటలకు మహాగణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశస్థాపన, దేవతాహ్వానం, అంకురార్పణ, గంగతెప్ప తదితర పూజలతో వేడుకలు ప్రారంభం కానున్నాయి.

రెండో రోజైన మంగళవారం ఎల్లమ్మ తల్లి కల్యాణాన్ని ఆలయం లోపల మండపంలో వేదపండితులు నిర్వహించనున్నారు. బుధవారం అమ్మవారి రథోత్సవం దేవాలయం లోపలే నిర్వహిస్తారు. ఈ మూడు రోజులూ భక్తులకు అనుమతి లేదు. లక్షలాది మంది భక్తుల సమక్షంలో వైభవంగా జరగాల్సిన ఎల్లమ్మ కల్యాణం కరోనా వైరస్‌ కారణంగా ఆలయం లోపలే నిర్వహించాలని దేవాదాయశాఖ నిర్ణయం తీసుకుంది.

ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్తు దీపాలు, పూలు, రంగులతో సుందరంగా అలంకరించారు. అమ్మవారి దర్శనం కోసం ఈ మూడు రోజులూ భక్తులెవరూ దేవాలయం వద్దకు రావద్దని, దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇబ్బందులు పడొద్దని ఈఓ కుంట నాగరాజు, ఛైర్మన్‌ కొత్తపల్లి సాయిబాబాగౌడ్‌ సూచించారు.

ఇవీ చూడండి: మందు లేని మాయదారి రోగం కరోనా.. అంటూ పాటతో అవగాహన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.