ETV Bharat / state

ఆటో డ్రైవర్ కుటుంబం ఆత్మహత్య కేసు: సీఐ, హెడ్ కానిస్టేబుల్​కు బెయిల్

author img

By

Published : Nov 9, 2020, 9:36 PM IST

ఏపీలో నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో అరెస్టయిన సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్​కు.. సోమవారం బెయిలు మంజూరు అయింది.

ఆటో డ్రైవర్ కుటుంబం ఆత్మహత్య కేసు: సీఐ, హెడ్ కానిస్టేబుల్​కు బెయిల్
ఆటో డ్రైవర్ కుటుంబం ఆత్మహత్య కేసు: సీఐ, హెడ్ కానిస్టేబుల్​కు బెయిల్

ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో అరెస్టయిన సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్​కు.. సోమవారం బెయిలు మంజూరు అయింది.

దొంగతనం కేసులకు సంబంధించి తమ ప్రమేయం లేకున్నా.. పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం.. కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు.. పోలీసుల తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తూ సెల్పీ వీడియో చిత్రీకరించారు. ఘటన జరిగిన అనంతరం.. ఆ వీడియో పోలీసులకు లభించింది. ఉన్నతాధికారులు.. సీఐ, హెడ్ కానిస్టేబుల్​ను విధుల నుంచి తప్పించారు. వారిపై కేసు నమోదు చేశారు. ఆదివారం అరెస్టైన సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్​కు.. నంద్యాల జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు వారం రోజులు రిమాండ్ విధించింది. అనంతరం వారు దాఖలు చేసిన పిటిషన్ మేరకు.. సోమవారం బెయిల్ మంజూరు చేసింది.

ఇదీ చూడండి: యాదాద్రి ఆలయ కాటేజీ వద్ద అగ్నిప్రమాదం.. దగ్ధమైన ఐరన్​ పైపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.