బాగ్‌అంబర్‌పేట డివిజన్ ప్రజలు అవకాశం కల్పిస్తే నందనవనం డంపింగ్ యార్డ్ వివాదాన్ని పరిష్కారిస్తానని ఆ డివిజన్ భాజపా అభ్యర్థి పద్మా వెంకట్ రెడ్డి తెలిపారు. అదే డివిజన్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. కరోనా, వరదల వంటి ఆపత్కాలాల్లో తాము ఆదుకున్నామని గుర్తు చేశారు.
తానూ, కార్యకర్తలు ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండి చాలా కష్టపడ్డామని... ఫలితంగా ప్రజలు నేడు తమకు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. స్థానికంగా రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలకూ పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో భాజపా గెలుపు ఖాయమని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: అవకాశమిస్తే స్మార్ట్ సూరారం: బట్ట వెంకటేశ్