ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు.... కొనసాగుతోంది. ఆరో రౌండ్ పూర్తయ్యే సరికి వైకాపా ఆధిక్యంలో ఉంది. ఆ పార్టీ అభ్యర్థి 52వేల 24 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తొలి రౌండ్ నుంచి వైకాపా అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొదటి రౌండ్ లో 8వేల 790 ఓట్ల ఆధిక్యం వచ్చింది. రెండో రౌండ్‌లో 8వేల 300, మూడో రౌండ్‌లో 7వేల879, నాల్గో రౌండ్‌లో 7వేల 626 మెజార్టీ వచ్చింది.
ఐదో రౌండ్‌లో వైకాపా అభ్యర్థికి 9వేల 986 ఓట్లు, ఆరో రౌండ్‌లో 9వేల 443 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఆసక్తికరంగా ఆరు రౌండ్లు పూర్తయ్యే సరికి నోటాకు 2వేల 98ఓట్లు పోలయ్యాయి. మొత్తం 12 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మధ్యాహ్నానికి ఓట్ల లెక్కింపు పూర్తికానుంది. గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవాలు జరుపుకోవద్దని పోలీసులు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: Huzurabad Byelection Counting 2021 : హుజూరాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం