ETV Bharat / state

జూన్​ 4 నుంచి 12 వరకు 'బడిబాట'... - BADI BATA PROGRAMME

సర్కారు బడుల్లో విద్యార్థులను పెంచే లక్ష్యంతో జూన్ 4 నుంచి బడిబాట కార్యక్రమం చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతలు వివరిస్తూ ఇంటింటి ప్రచారం చేసేందుకు సిద్ధమవుతోంది. 5రోజులపాటు రోజుకో విధంగా కార్యక్రమం నిర్వహించేందుకు ప్రణాళికలు చేసింది.

జూన్​ 4 నుంచి 12 వరకు 'బడిబాట'...
author img

By

Published : May 18, 2019, 4:35 AM IST

Updated : May 18, 2019, 8:17 AM IST

చదువుకు దూరంగా ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్పించడంతోపాటు.. సర్కారీ బడుల్లో విద్యార్థులను పెంచేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. జూన్ 4 నుంచి జూన్ 12వరకు పండగ వాతావరణం ప్రతిబింబించేలా 'ఆచార్య జయశంకర్ బడిబాట' కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. దీని లక్ష్యాలు, నిర్వహణ తీరుపై విధివిధానాలు వివరిస్తూ డీఈఓలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు పంపించారు.

జూన్​ 4 నుంచి 12 వరకు 'బడిబాట'...

ఇంటింటికీ ప్రచారం...

జూన్ 1 నుంచి జూన్ 3 వరకు కలెక్టర్లు బడిబాట సమన్వయ సమావేశం నిర్వహించి ప్రణాళిక రూపొందిస్తారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీలు ఉదయం 7 గంటల నుంచి 11 వరకు ఇంటింటికీ తిరిగి పిల్లలు, తల్లిదండ్రులను కలిసేలా ఏర్పాట్లు చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సరిగా చదువు చెప్పరని... వసతులు ఉండవన్న భావనను తొలగించాలని నిర్ణయించారు.

కరపత్రాల పంపిణీ...

ఆంగ్ల మాధ్యమం, డిజిటల్ తరగతులు, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, ఉచితంగా పుస్తకాల పంపిణీ, రెండు జతల యునిఫాం ఇస్తున్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. బడుల ప్రత్యేకతలు, సాధించిన విజయాలు వివరిస్తూ కరపత్రాలు ముద్రించి పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ఒక్కో పాఠశాలకు వెయ్యి రూపాయలు మంజూరు చేయాలని డీఈఓలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశించారు.

జూన్​ 4 నుంచి 12 వరకు కార్యక్రమాలు...

జూన్ 4న గ్రామాలు, బస్తీల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీలు.. స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రముఖులతో కలిసి ర్యాలీలు చేపట్టనున్నారు. జిల్లా మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులందరినీ భాగస్వామ్యం చేయాలని భావిస్తున్నారు. జూన్ 7న బాలికవిద్య ఆవశ్యకతపై ప్రచారం చేస్తూ.. కేజీబీవీలు, బాలికలకు ఆరోగ్య కిట్లు, ఇతర సదుపాయాలు వివరిస్తారు.

జూన్ 10న పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహిస్తారు. 11న స్వచ్ఛ పాఠశాల, హరితహారం నిర్వహించి... బడులను శుభ్రం చేసి మొక్కలు నాటుతారు. జూన్ 12 చివరి రోజున ఇంటింటి సర్వే చేసి బాల కార్మికులను గుర్తించి బడుల్లో చేర్పించడంతో పాటు... విశ్రాంత ఉపాధ్యాయులు, అధ్యాపకులను కూడా భాగస్వామ్యం చేయనున్నారు.

పదికి పది జీపీఏ సాధించిన వారికి సన్మానం...

జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు.. పదో తరగతిలో పదికి పది జీపీఏ సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను సన్మానించాలని నిర్ణయించారు. అత్యధిక హాజరు ఉన్న విద్యార్థులను కూడా సత్కరిస్తారు.

Last Updated : May 18, 2019, 8:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.