ETV Bharat / state

ఎక్కడ కూల్చారో... అక్కడే నిర్మించండి - pcc working president

వక్ఫ్​ బోర్డు హెచ్చరించినా వినకుండా జీహెచ్​ఎంసీ అధికారులు అంబర్​పేటలోని మసీద్​ను అక్రమంగా కూల్చివేయడంపై పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అజారుద్దీన్​ మండిపడ్డారు. తిరిగి అక్కడే మళ్లీ మసీదు నిర్మాణం చేపట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

ఎక్కడ కూల్చారో... అక్కడే నిర్మించండి
author img

By

Published : May 13, 2019, 6:33 PM IST

ఎక్కడ కూల్చారో... అక్కడే నిర్మించండి

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తోందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అజారుద్దీన్‌ అన్నారు. ఎన్నికల ప్రచారాల్లో మోదీ అభివృద్ధి గురించి మాట్లాడకుండా గాంధీ కుటుంబంపై విమర్శలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని దుయ్యబట్టారు. ఐదేళ్లలో మోదీ దేశానికి ఏం చేయలేదని, ఏదైనా చేస్తే చెప్పుకునేవారన్నారు. అంబర్​పేటలోని మసీదును అక్రమంగా కూల్చివేశారని ఆరోపించారు. తిరిగి అక్కడే మళ్లీ మసీదును పునఃనిర్మించాలని కోరారు. వక్ఫ్​ బోర్డు పరిధిలో ఉన్న మసీదుకు ఇతరులు ఎలా పరిహారం చెల్లిస్తారని దీనిపై పూర్తి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి : 'రైతులకు అన్యాయం చేస్తే కాంగ్రెస్‌ చూస్తూ ఊరుకోదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.